టైటానిక్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్రేమికుల మది పులకరిస్తుంది. హాలీవుడ్ లో అదో అందమైన దృశ్యకావ్యం. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఆ సినిమా బద్దలుకొట్టింది. అంతేకాదు.. ఆస్కార్ అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పుడు టైటానిక్ మరోసారి తెరపైకి వస్తోంది.

Image result for titanic

          టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్. సృజనాత్మక చిత్రాల రూపశిల్పిగా కామెరూన్ కు మంచి పేరుంది. స్టోరీకి టెక్నాలజీని జోడించి.. ప్రేక్షకులను కట్టిపడేయంలో కామెరూన్ ముందుంటారు. ఆయన తీసిన టైటానిక్ సినిమా ఓ సెన్సేషన్. 105 ఏళ్ల క్రితం జరిగిన ఓ పడవ ప్రమాదం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. నాడు పడవ మునిగేందుకు కారణాలు, ఆ సమయంలో ఓడలో ప్రయాణిస్తున్నవారి పరిస్థితితో పాటు అంతర్లీనంగా ఓ ప్రేమజంట భావోద్వేగాలను కామెరూన్ టైటానిక్ లో బంధించారు.

Image result for titanic and james cameron

          టైటానిక్ రిలీజై ఇప్పుడు 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో నాటి టైటానిక్ అనుభవాలను కామెరూన్ గుర్తు చేసుకోవాలనుకున్నాడు. అందుకే తన అనుభవాలన్నింటినీ బంధించి రికార్డు చేస్తున్నాడు. తన అనుభవాలు, తాను చేసిన తప్పులు, చేయాలనుకుని చేయలేకపోయిన సీన్లు.. ఇలా అన్నింటినీ కామెరూన్ ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నాడు. నేషనల్ జాగ్రఫిక్ చానల్ కోసం కామెరూన్ ఈ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందని తెలుస్తోంది. సో.. 20 ఏళ్ల తర్వాత మరోసారి టైటానిక్ అనుభవాలు మన కళ్లముందుకు రాబోతున్నాయి. బీ రెడీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: