నిన్నటి దాకా ‘అత్తారింటికి దారేది’ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి రామ్ చరణ్ ల ప్రస్తావన లేదు. కనీసం వీరిద్దరి కటౌట్ కూడా ఎక్కడా కనిపించ లేదు అని రకరకాల వార్తలు వచ్చిన నేపధ్యంలో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ రామ్ చరణ్ ఈ విషయానికి నిన్న చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. తన ఫేస్ బుక్ లో ‘అత్తారింటికి దారేది’ టీమ్ కు ముఖ్యంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు చెపుతూ పోస్ట్ పెట్టి ఆశ్చర్య పరిచిన చెర్రీ నిన్న ఏకంగా తన బాబాయ్ కు వచ్చిన ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అతిధులు సమక్షంలో తన బాబాయ్ తరపున అవార్డు స్వీకరించి అందర్నీ ఖంగ్ తినిపించాడు.

పవర్ స్టార్ పవన్ కు ఈ అవార్డు ఫంక్షన్ కు వ్యక్తిగత కారణాలు రీత్యా రాలేకపోవడంతో పవన్ సూచన మేరకు చెర్రీ ఈ అవార్డు స్వీకరించాడని చెపుతున్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి బాబాయ్ అబ్బాయ్ ల మధ్య వార్ సంధికి దారి తీస్తోందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కుటుంబ కలహాలను బజరున పడకుండా రామ్ చరణ్ ఈ వ్యవహారంలో తెలివిగా వ్యవహరించాడని చెర్రీ అభిమానులు ఆనంద పడుతున్నారు. ఎదిఎమైనా రామ్ చరణ్ ఈ యుద్దంలో యూటర్న్ తీసుకున్నాడని అనుకోవాలి.ఇంతకీ ఈ యూటర్న్ ఆలోచన బాబాయ్ అబ్బాయ్ లలో ఎవరిదో మరి....
 

మరింత సమాచారం తెలుసుకోండి: