"తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలి, చూస్తే మహాభారత చూడాలి"  మహాభారతంలో ఉన్నదంతా భువిన ఉన్నదే. భువి పైన జరిగేదంతా మహాభారతంలో ఉన్నదే. అందుకే మహాభారతం 5000 సంవత్సరాల భారత ఉపఖండాన్ని సాంస్కృతి సాంప్రదాయాలను దుర్నీతి దుష్టత్వం తో సహా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.


రాజనీతే కాదు రాజకీయం, రణం మరణం తధాదిఅంశాలు పుష్కళంగా ఉన్న సంక్లిస్థను ఇందులో చూడొచ్చు. యుద్ధం లో ఎత్తులు పైయెత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు ఈ కురుక్షేత్ర యుద్ధం లో ఉన్నంతగా ఏ దేశ చరిత్రలోను లేదు. 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్న యుద్ధాన్ని వెండితెరపై వీక్షించాలంటే రెందుకళ్ళు చలవు, వెండితెర పట్టదు. మనోనేత్రం మాత్రమే చూడగల విన్యాసమది. అందుకే భారత జీవనాడిగా నిలిచింది మహాభారతం అందులోని కురుక్షేత్రం.

Image result for kurukshetra movie kannada


మహాభారతం లోని లోని కురుక్షేత్రయుద్ధం ప్రథానాంశం గా "కురుక్సేత్ర" పేరుతో ఒక కన్నడ సినిమా నిర్మాణం కాబోతుంది. అది కూడా కన్నడ చిత్ర రంగం లో అత్యనత భారీ గా భారీ బడ్జెట్ తో - అది సాదాసీదా బడ్జెట్ మాత్రం కాదు, మామూలు నటీ నటులతో కాదు. కళ్లు చెదిరే వ్యయం, అత్యద్భుత తారాగణంతో "కురుక్షేత్ర" నిర్మాణానికి రంగం సిద్ధమైంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు నిర్మాత మునిరత్న చెప్పారు.  తెలుగు సినిమా రంగంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి, బాహుబలి–2 సినిమాలు ఇచ్చిన ప్రోత్సాహం తో అవి సూపర్‌హిట్‌ అయిన తీరు ఇచ్చిన ధైర్యం తో అదే దారిలో కురుక్షెత్ర కన్నడ సినిమాకు కూడా రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మాణానికి పూనుకున్నారు బెంగళూరు కు చెందిన సినీ నిర్మాత మునిరత్న. 

Image result for kurukshetra movie kannada

ఆదివారం రాత్రి బెంగళూరు యశ్వంతపురలో "ప్రభాకర్‌ కొరే సమావేశం హాల్" లో సుముహూర్తం షాట్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్లాప్‌కొట్టటం తో నిర్మాణం ప్రారంభమైంది. ఎం.పీ బీ.కే. హరిప్రసాద్‌ కెమెరా స్విచ్‌ ఆన్ చేశారు. ఈ వేడుకల్లో హీరోలు రవిచంద్రన్, దర్శన్ తో పాటు రెబల్‌ స్టార్‌ అంబరీష్, నటి హరి ప్రియ, ప్రముఖ నటులు అర్జున్ సర్జా, శశి కుమార్, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Image result for kurukshetra movie kannada

ఛాలెంజింగ్‌ కన్నడ సూపర్ స్టార్‌ దర్శన్ దుర్యోధనునిగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం ఈ నెల 9వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో రెగ్యులర్ షూటింగ్‌ ఆరంభమవుతుంది. దీనికోసం ఫిల్మ్ సిటీ లో 16 సెట్‌ లను ఏర్పాటు చేసినట్లు, విరామం లేకుండా నిరవధికంగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రజల ముందుకు ఈ బృహత్తర చిత్రాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను ఇప్పటికే రెడీ చేసినట్లు ఇది కన్నడ స్టార్ హీరో దర్శన్ 50వ సినిమా కావడం విశేషం. విభిన్న బాషా నటి స్నేహ ద్రౌపది పాత్రలో కనిపించటం మరో విశేషం.

Image result for kurukshetra movie kannada

ఈ సినిమాలోని ముఖ్య పాత్రలు- పాత్రలు పోషిస్తున్న పాత్రధారులు. 

భీష్ముడు: అంబరీష్‌
కృష్ణుడు : రవిచంద్రన్
కర్ణుడు : అర్జున్
ద్రోణాచార్యుడు : శ్రీనివాసమూర్తి
ధృతరాష్ట్రుడు : శ్రీనాథ్‌
కుంతీదేవి : లక్ష్మి
ధర్మరాజు : శశికుమార్‌
దుశ్శాసనుడు : రవిశంకర్‌
అభిమన్యుడు : నిఖిల్‌కుమార్‌
భీముడు : డ్యానిష్‌


ఒక ప్రత్యేక నృత్యగీతంలో నటి హరిప్రియ  అలరించనుంది.

Image result for sexiest haripriya actress

మరింత సమాచారం తెలుసుకోండి: