ఆ మద్య ఓ సినిమాలో విలన్ కొట్టే డైలాగ్ కి నిజంగా రాజకీయం అంటే అంతలా ఉంటుందా అని అనిపిస్తుంది..ఇంతకీ ఆ విలన్ కొట్టే డైలాగ్ ఏంటా అనుకుంటున్నారా..! ‘రాజకీయ నాయకులకు సిగ్గుండదు..స్మశానం ముందు ముగ్గు ఉండదు’.  నిజంగా ఈ మద్య రాజకీయాలు చూస్తుంటే నిజంగా రాజకీయాల్లో ఇంత కుళ్లు, కుతంత్రాలు ఉంటాయని అని అనిపిస్తుంది. తాజాగా నేటి రాజకీయ వ్యవస్థపై ప్రముఖ దర్శకులు కొరటాల శివ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్కువ సినిమాలు తీసి ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు కొరటాల శివ.
Image result for koratala shiva mahesh babu
 సాదారణంగా ఇండస్ట్రీలోని ప్రముఖులు రాజకీయాలకు చాల దూరంగా ఉంటారు, ఎవరో కొందరు మాత్రమే రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.  ఇండస్ట్రీలో ఉంటూ రాజకీయల్లో ప్రవేశించిన వారిలో చాలా మందీ నటులు ఉన్నారు.   ఈ రాజకీయాలపై మన సినీ ఇండస్ట్రీ లో ఒకప్పుడు దివంగత దాసిరి గారు మాట్లాడేవారు..తాజాగా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు..ప్రముఖ దర్శకులు కొరటాల శివ. ప్రస్తుత రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా కుళ్లిపోయాయని, దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడు అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు కొరటాల.

మనం మాత్రమే వీటిని సరైన దారిలోకి తీసుకురాగలమని సూచించాడు కొరటాల.  ప్రస్తుతం సోషల్ మీడియాలో కొరటాల ట్విట్ కి చాలా మంది స్పందిస్తున్నారు.  అంతేకాదండోయ్ కొరటాల ప్రస్తుతం మహేష్‌బాబుతో రాజకీయ నేపథ్యంతో కూడిన ‘భరత్ అనే నేను’ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ ముఖ్యమంత్రి రోల్ పోషిస్తున్నాడని సమాచారం.  మరి ఈ సినిమా కోసం కొరటాల అప్పుడు కొత్త రకం ప్రమోషన్ మొదలు పెట్టాడా అని అనుకుంటున్నారు చాలా మంది. ఏదేమైనా రాజకీయాల గురించి కొరటాల వ్యాఖ్యలు అక్షర సత్యమని నమ్మక తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి: