సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.  తమిళ, తెలుగు, హిందీ, మళియాళ ఇండస్ట్రీలో ఈ ప్రేమజంటలు మనకు సుపరిచితమే.  అయితే టాలీవుడ్ లో శివ చిత్రంలో నటించి ఆనాటి నుంచి ప్రేమలో మునిగి తేలిన అక్కినేని నాగార్జున, అమల తర్వాత పెళ్లి చేసుకున్నారు.  తాజాగా అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు.  
Image result for naga chaitanya wedding card
‘ఏం మాయ చేశావే’ చిత్రంలో నటించిన తన సహనటి సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆ మద్య హైదరాబాద్‌లో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేనిమరో వారసుడు అఖిల్ పెళ్లి అనూహ్యంగా క్యాన్సిల్ కావడంతో వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే రూమర్లు ఇటీవల విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల పెళ్లి అక్టోబ‌ర్‌లో గోవాలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.
Image result for naga chaitanya wedding card
ఈ నేప‌థ్యంలో వారి పెళ్లి ప‌త్రిక ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.   ప్రస్తుతం నాగ చైతన్య ‘యుద్దం శరణంగచ్చామి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రంలో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే.  మరో తమిళ చిత్రంలో కూడా నటిస్తున్న సమంత అక్టోబర్ నాటికి షూటింగ్స్ పూర్తి చేసుకొని పెళ్లికి రెడీ కాబోతున్నారు.
Image result for naga chaitanya wedding card
ఇక అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అన్న‌పూర్ణ‌, రామానాయుడు, రాజేశ్వరి జంట‌ల ఆశీస్సుల‌తో నాగ‌చైత‌న్య, స‌మంత‌లు అక్టోబ‌ర్ 6న ఒక్క‌టి కానున్నార‌ని ఈ ఆహ్వాన ప‌త్రిక‌లో ఉంది. అలాగే గోవాలో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోయే వేదిక చిరునామా కూడా ఈ పెళ్లి ప‌త్రిక‌లో ఉంది. అయితే పెళ్లికి  అహ్వానించే వారు  నాగార్జున, అమ‌ల పేర్ల‌తో పాటు నాగచైత‌న్య తల్లి ల‌క్ష్మి, ఆమె భ‌ర్త శ‌ర‌త్ పేర్ల‌ను కూడా ప‌త్రిక‌పై ప్ర‌చురించారు. 

Image result for naga chaitanya wedding card


మరింత సమాచారం తెలుసుకోండి: