సినిమా ఇండస్ట్రీలో అనగానే అదో అందమైన రంగుల ప్రపంచం అని..తెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు తమ స్టార్ తిరిగిపోయినట్లే భావిస్తారు ఎంతో మంద ఔత్సాహిక కళాకారులు.  దీనికోసం స్టూడియోల చుట్టు ప్రదక్షణలు చేస్తూ తమ జీవితాలు నాశనం చేసుకున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  ముఖ్యంగా అందమైన అమ్మాయిలకు సినిమా చాన్స్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని లైంగికంగా వాడుకున్న తర్వాత వ్యభిచారానికి కూడా పురిగొలిపే దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు.  
Image result for rape image
ఇలాంటి వాటిపై కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా సినిమాలో ఛాన్స్ కోసం వెళ్లిన ఓ కళాశాల అమ్మాయిని తన లైంగిక కోరిక తీరిస్తే.. సినిమా ఛాన్స్ ఇస్తానంటూ ఓ సినీ దర్భకుడు ఒత్తిడి చేసిన ఘటన పూణే నగరంలో సంచలనం రేపింది.  వివరాల్లోకి వెళితే...మహారాష్ట్రలోని జెజూరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అమ్మాయి పూణే ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తుంది. సెలవు రోజు తన స్వగ్రామమైన జెజూరీకి వచ్చిన అమ్మాయికి వాట్సాప్‌లో తాము కొత్తగా నిర్మించనున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు మెసేజ్ వచ్చింది.
Image result for rape image
అంతే ఒక్కసారే ఎగిరి గంతేసింది..తన అదృష్టం మారబోతుందని భావించింది. ఎప్పటి నుంచి తాను సినిమా యాక్టర్ కావాలన్న కల నెరవేరబోతుందని సంతోష పడింది. అంతే బట్టలు సర్ధుకొని  పూణే నగరానికి వచ్చింది. ఆడిషన్ కోసం కాలేవాడీలోని తప్కీర్ చౌక్ కు వెళ్లి సినీదర్శకుడు అప్పా పవార్‌ను కలిసింది.  అయితే ఆ యువతిని చూసిన సినీదర్శకుడు అప్పా పవార్‌ వక్రబుద్ది ప్రదర్శించాడు..తనకు పడక సుఖం అందిస్తే..ఆడిషన్ లేకుండా హీరోయిన్ చేస్తానని నమ్మబలికాడు.

దీంతో తాను మోసపోయానని అర్ధం చేసుకున్న ఆ యువతి వెంటనే తన స్వగ్రామం చేరుకుంది.  రెండు రోజుల తర్వాత తిరిగి పూణే వచ్చి సదరు సినీ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వాకాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టరు సంగీత చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: