తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కైవసం చేసుకున్న గొప్ప నిర్మాత దగ్గుబాటి రామానాయుడు.  ఆయన వారసులు దగ్గుబాటి సురేష్, వెంకటేష్.  తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ హీరోగా పేరు తెచ్చుకోగా..దగ్గుబాటి సురేష్ బాబు అగ్ర నిర్మాతగా మారారు.  ఇక ఇండస్ట్రీలో వారసత్వపు హీరోలు వస్తున్న తరుణంలో సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా లీడర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తాజాగా తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనే రాజు..నేనే మంత్రి’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది.  
Image result for nene raju nene mantri
అయితే ఈ చిత్రాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ కి చెందిన   'సురేశ్ మహల్' లో అంగరంగ వైభవంగా ఓపెన్ చేయాలని ఆలోచించారు దగ్గుబాటి ఫ్యామిలీ.  ఇందుకోసం స్వయంగా హీరో రానా వెళ్లేందుకు సిద్దమయ్యారు.  కానీ అనుకోని దుర్వార్త వినాల్సి వచ్చినందుకు దగ్గుబాటి ఫ్యామిలీ షాక్ కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా చీరాలలోని ఇప్పటి వరకు టూరింగ్ టాకీసులే ఉన్నాయి.  

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో హంగులతో థియేటర్ల నిర్మాణాలు చేపడుతుంటే..చీరాలలో మాత్రం ఇప్పటికే ఇలాంటి టాకీసులే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో  చర్చ్ రోడ్ లోని తమ ధియేటర్ 'సురేశ్ మహల్'ను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది దగ్గుబాటి ఫ్యామిలీ. ఏసీ, డిజిటల్ సౌండ్ వంటి హంగులతో సురేశ్ మహల్ ను సిద్ధం చేశారు.
Image result for suresh mahan at chirala
అంతే కాదు 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలతో నేడు రీఓపెనింగ్ కు ఏర్పాట్లు చేశారు. అయితే గురువారం ఉదయం మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో ఓ ఏసీ షార్ట్ సర్యూట్ తో థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: