సినిమా వాళ్లకి పెళ్ళిళ్ళ విషయం లో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. ఒకే వ్యక్తిని ఒకే సారి పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి బతికే సినిమా జనాలని మనం తక్కువగా చూస్తూ ఉంటాం. బిపాసా బాసూ లాంటి హాట్ హీరోయిన్ మాత్రం తన భర్త మీద తన ప్రేమ గురించి చాలా ఓపెన్ గా చెప్పేస్తోంది.


ఎలోన్ సినిమా షూటింగ్ టైం లో కిరణ్ సింగ్ గ్రోవర్ అనే అతన్ని పరిచయం చేసుకుని తరవాత ప్రేమగా మార్చుకున్న అఆమే 2016 లో అతన్ని పెళ్లి చేసుకుంది. ముంబైలో జరిగిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి బిపాసా ముఖ్య అతిథిగా హాజరైంది.


ఈ సందర్భంగా బిపాసా తన వివాహ వేడుకకు సంబంధించిన విషయాలను పంచుకుంది. " అప్పట్లో కాస్త హడావిడి గా నేను పెళ్లి చేసేసుకున్నాను. టైం తీసుకుని పక్కా ప్లానింగ్ తో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఉండి ఉంటె బాగుండేది. వీలైతే ప్రతీ ఏడాదీ నా భర్తని మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆ రకంగా ఏడాదికి ఒక పెళ్లి టైపు లో వెళుతుంది నా జీవితం " అంటూ నవ్వేసింది ఆమె 

మరింత సమాచారం తెలుసుకోండి: