మొన్న ఇండిపెండెన్స్ డే సెలవులను టార్గెట్ చేస్తూ విడుదలైన మూడు సినిమాల కలక్షన్స్ రిజల్స్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. గత శుక్రవారం మూడు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో వీటిలో  మీ ఛాయిస్ ఏది అంటూ సోషల్ మీడియాలో మూణ్నాలుగు రోజుల ముందు నుంచి చాలామంది ఒపీనియన్ పోల్స్ పెట్టారు. ఎక్కువమంది ఓటు వేసింది ‘నేనే రాజు నేనే మంత్రి’ కి అయితే ‘లై’ కి రెండో స్థానం దక్కింది. 

దాదాపు 80 శాతం మంది ఈ రెండు సినిమాలకే ఓటేశారు. పది శాతం పైగా మాత్రమే ‘జయ జానకి నాయక’ ను ఎంచుకున్నారు. అయితే ఈ మూడు సినిమాల ఫైనల్ టాక్ చూస్తుంటే చివరికి ‘జయ జానకి నాయక’నే విజేతగా నిలిచేలా కనిపిస్తోంది అంటూ టాలీవుడ్ కలక్షన్స్ విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నారు. ‘లై’ సినిమా ఇంటలిజెంట్ థ్రిల్లర్ గా టాక్ తెచ్చుకున్నా అది లిమిటెడ్ అప్పీల్ ఉన్న సినిమాగా మారిపోయి బిసి సెంటర్ల ప్రేక్షకులకు రీచ్ కావడం కష్టమే అంటున్నారు.
 
‘నేనే రాజు నేనే మంత్రి’ విషయానికొస్తే అది కూడా ఓ వర్గం ప్రేక్షకులకు పరిమితమయ్యే సినిమా సీరియస్ గా సాగే ఈ పొలిటికల్ డ్రామాగా మారడంతో సగటు ప్రేక్షకుడికి ఏమాత్రం కనెక్ట్ అవ్వదు అన్న  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తొలి రోజు రానా సినిమా కలెక్షన్ల విషయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిస్తే ‘లై’ కూడా మంచి ఓపెనింగ్సే తెచ్చుకుంది. 

అయితే ‘జయ జానకి నాయక’ ఫస్ట్ ఛాయిస్ కాకపోయినా సాయంత్రానికి కలెక్షన్లు బాగా పుంజుకుని నిన్న శనివారం రోజున ఉదయం నుంచే బిసి సెంటర్లలో మంచి కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్నంతలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్టయ్యే సినిమా ఏదంటే ‘జయ జానకి నాయక’ అంటూ సగటు ప్రేక్షకుడు తీర్పు ఇవ్వడంతో ఈసినిమా బాగా నిలబడే అవకాసం ఉంది అని అంటున్నారు. 

 ‘లై’, ‘జయ జానకి’ చిత్రాలకు సంబంధించి 45 నుంచి 50 కోట్ల వసూళ్లు సాధిస్తేనే బయ్యర్స్ ప్రాఫిట్ జోన్ కువెళతారు కాబట్టి ఈ త్రిముఖ పోటీలో ఆ రేంజ్ కలక్షన్స్ ఈ రెండు సినిమాలకు రావడం కష్టం అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం కమర్షియల్ సక్సస్ ‘జయ జానకి నాయక’ కు వచ్చినట్లుగా నిన్నటిరోజు కలక్షన్స్ ఫలితాలను బట్టి అంచనా వేసుకోవచ్చు..  



మరింత సమాచారం తెలుసుకోండి: