ఇండియన్ సినిమాకు బాహుబలి-2 కలక్షన్స్ ఓ మైల్ స్టోన్ గా మారాయంటే నమ్మాల్సిందే. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా భాషతో సంబంధం లేకుండా బీభత్సం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో కలుపుకుని సినిమా దాదాపు 1700  కోట్ల కలక్షన్స్ ను సాధించింది. అయితే అంతకుముందే రిలీజ్ అయిన దంగల్ మూవీ చైనా కలక్షన్స్ తో కలుపుకుని బాహుబలికి ధీటుగా నిలబడే ప్రయత్నం చేసింది.


భారీ సినిమా అంటే అది బాహుబలితో పోల్చేస్తున్న ఈ క్రమంలో బాహుబలి పార్ట్-2 రికార్డులను చెరిపేసేందుకు వస్తున్నాడు సూపర్ స్టార్ రజినికాంత్. రోబో సీక్వల్ గా శంకర్ డైరక్షన్ లో వస్తున్న 2.0తో బాహుబలి ఏ ఒక్క రికార్డ్ మిగలకుండా చేయాలన్నదే ఆ సినిమా టార్గెట్. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ నుండి సినిమా రేంజ్ పెంచేస్తున్నారు.


ఇప్పటిదాకా టైటిల్ పోస్టర్ తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 60 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఇది కచ్చితంగా అదరగొట్టే రికార్డ్ అని చెప్పొచ్చు. ఒక్క తెలుగులోనే ఇలా సంచలనం సృష్టిస్తుంటే ఇక వరల్డ్ వైడ్ 2.0 ఎలా సందడి చేస్తుందో ఊహించవచ్చు. మొదట భారీ కలక్షన్స్ సాధించడమే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా టాప్ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తపడుతున్నారట.


అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2018 జనవరి 25న రిలీజ్ అవుతుంది. మరి అనుకున్న సక్సెస్ తో అంచానాలను మించి సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: