తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా చెప్పుకుంటున్న బిగ్ బాస్ నాలుగోవారంలోకి ఎంటరైంది. ఆరంభం నుంచి ఇప్పటివరకూ ఈ షో రేటింగ్స్ లో టాప్ లో కొనసాగుతోంది. స్టార్ మా కూడా ఎప్పటికప్పుడు సర్ప్రైజెస్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి హీరో నవదీప్ ను పంపించి మరో సర్ ప్రైజ్ ఇచ్చింది.

Image result for navdeep and mumaith in bigg boss

          హీరో నవదీప్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యాడు. ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతుండగా.. ఈ వారం మాత్రం ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. అందుకే ఒకరిని లోపలికి పంపుతున్నట్టు ప్రకటించాడు ఎన్టీఆర్. అయితే నవదీప్ ఎందుకు వెళ్తున్నాడు.. ఎవరికోసం వెళ్తున్నాడు.. అంటే ముమైత్ కోసమేమో.. అనుకోవాలి. ఎందుకంటే ఇటీవలే ముమైత్ తనకోసం ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ను పంపించాలంటూ బిగ్ బాస్ ను కోరారు.

Image result for navdeep and mumaith in bigg boss

          బిగ్ బాస్ లో పెళ్లి కాని అబ్బాయ్ ప్రిన్స్ ఒక్కడే ఉన్నాడు. అతడేమో మొదట్లో అర్చన వెంటపడి ఇప్పుడు దీక్ష చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో ముమైత్ ను పట్టించుకునేవారెవరూ లేరు. అందుకే ముమైతే తనకోసం ఒక అబ్బాయ్ ని పంపించాలని కోరింది. బహుశా ఆమె కోరికను మన్నించి బిగ్ బాస్ నవదీప్ ను పంపించాడేమో అనుకోవచ్చు.

Image result for navdeep and mumaith in bigg boss

                తన దగ్గర ఒక స్టోరీ ఉంది.. వింటావా అంటూ ఇంట్లో అందరినీ వెంటోడుతోంది ముమైత్. ఇంటి సభ్యులెవరు వినేందుకు సిద్ధంగా లేరు. బహుశా ఇప్పుడు ముమైత్ స్టోరీని నవదీప్ వింటాడేమో.. చూద్దాం..!


మరింత సమాచారం తెలుసుకోండి: