‘బ్రహ్మోత్సవం’ లాంటి భారీ ఫ్లాప్ తరువాత మహేష్ నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా కూడ అదే బాటలో పయనించా బోతోందా అన్న అనుమానాలు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. దీనికి కారణం ఈమూవీ  పై మురగదాస్ అనుసరిస్తున్న వ్యూహం అని అంటున్నారు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాకి సంబంధించి ప్రతి విషయంలోను శ్రద్ధ పెట్టాలి. 

గతంలో ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి రాజమౌళి  ఆ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన  ప్రతి పోస్టర్‌ తోను అదే విధంగా ప్రతీ చిన్న విషయంలోను  ఆ సినిమా విడుదలకు ముందు తీసుకున్న జాగ్రత్తలు ఆసినిమా ఘన విజయానికి ఎంతో కారణం అయింది అన్న కామెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల ట్రైలర్స్ విషయంలో దర్శకుడు అద్భుతంగా కట్ చేసి ఆసినిమాల పై అంచనాలను పెంచే స్తున్నారు. 

అయితే  ఈవిషయంలో మురగదాస్ తీవ్రంగా విఫలం అవ్వడంతో ఆ ఫలితం ఇప్పుడు ‘స్పైడర్’ భవితవ్యాన్ని సాసిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  'స్పైడర్‌' చిత్రానికి ఆకర్షణీయమైన టీజర్‌ కట్‌ చేయడంలో మురుగదాస్‌ టీమ్‌ విఫలమైంది. 'స్పైడర్‌' టీజర్‌కి అభిమానుల నుంచి కూడా మిశ్రమ స్పందన రావడాన్ని బట్టే ఇందులో విషయం లేదనేది అర్థమవుతోంది అంటూ ఈసినిమా బయ్యర్లు తీవ్రంగా కలత చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏడాదికి పైగా నిర్మాణంలో వున్న ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. కనీసం విజువల్‌గా అయినా ఆ గ్రాండ్‌నెస్‌ టీజర్‌లో కనిపిస్తుంది అని అభిమానులు ఆశిస్తే అక్కడ నిరాశ ఎదురు అవ్వడం మహేష్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఈసినిమాకు సంబంధించి డల్‌ ఫోటోగ్రఫీ, బ్యాడ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ని మహేష్‌ ఏమాత్రం కవర్ చేయలేకపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు ఈ టీజర్ ను చూసినవారు చాలామంది హాలీవుడ్ మూవీ 'సెవెన్త్‌ సెన్స్‌' చిత్రాన్ని గుర్తుకు చేస్తోంది అని కామెంట్స్ రావడం మరింత షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరో ట్రైలర్ తో మురగదాస్ టీమ్ ముందుకు రాబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక మరి ఈ ప్రయత్నం అయినా ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: