ఒక హీరో తాను నటించిన సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది అన్న విషయాన్ని ఏమాత్రం అంగీకరించడు. ముఖ్యంగా నితిన్ లాంటి క్ర్రేజీ హీరో తన లేటెస్ట్ మూవీ ‘లై’ పై చేసిన కామెంట్స్ చాలా మందినిని ఆశ్చర్య పరుస్తున్నాయి. నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ ఈ కామెంట్స్ చేసాడు.

ఈసినిమా విడుదలకు ముందురోజు తనకు నిద్ర పట్టలేదు అని అంటూ ఏడాది పాటు కష్టపడి కొత్తదనంకోసం ఈసినిమాను చేసిన విషయాన్ని తెలియచేసాడు.  ఈమూవీ  రిజల్ట్ ఎలా వస్తుందోనని తెగ టెన్షన్ పడుతున్న సమయంలో ఫస్ట్ పాజిటివ్ మెసేజ్ యూఎస్ నుంచి వచ్చిన సందర్భాన్ని వివరిస్తూ తెలుగురాష్ట్రలలో మటుకు ఈమూవీకి  వచ్చిన టాక్ తనను కలవర పెట్టిన విషయాన్ని బయటపెట్టాడు. 

ట్విట్టర్ ఫేస్ బుక్ లో 50మంది  ఈమూవీ చాలాబాగుంది అంటే మరో  20, 30 మంది పర్వాలేదన్నారని అయితే మరో 20 మంది అస్సలు బాగాలేదు అంటూ కామెంట్స్ చేసిన విషయాన్ని తెలియచేసాడు.  అయితే  ఫస్ట్ డే 'లై' బాగాలేదన్న చాలామంది రెండోరోజు నుంచి సినిమా బాగుంది అంటూ కామెంట్స్ చేసారని మరో ట్విస్ట్ ఇచ్చాడు నితిన్.

ఇప్పుడు  ‘లై’  బాగుందనేవాళ్ల సంఖ్య 60 శాతం పెరిగిందని చెపుతూ ఇక ఆదివారం టాక్ చూసేసరికి దాదాపు 85శాతం మంది సినిమా చాలాబాగుందని మెచ్చుకుంటున్నారని అంటూ నితిన్ తన సినిమాను ఫెయిల్యూర్ నుండి సక్సెస్స్ ట్రాక్ పట్టిన సినిమాగా పోల్చుకున్తున్నాడు. "అ ఆ’’ తర్వాత  తనకు ఏర్పడిన క్రేజ్ తో తాను ఒక  మంచి సాఫ్ట్ స్టోరీ కాని లేదా మరో లవ్ స్టొరీ కాని చేయవచ్చు అని చెపుతూ అయితే తాను మాత్రం రఫ్ దారినే ఎంచుకున్నాను అని అంటున్నాడు.

అయితే తన ‘లై’ సినిమాను రెగ్యులర్ సినిమాగా చూడవద్దని చెపుతూ నితిన్ వ్యూహాత్మకంగా తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈమూవీకి ఇప్పటికే మాస్ ప్రేక్షకులకు రిచ్ కావడంలేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ అశలు పరిస్థితి ఈసెలవుల  హడావిడి పూర్తి అయిన తరువాత ఎల్లుండి నుండి తెలుస్తుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: