డిసాస్టర్ సినిమాలు అంటే ఎలా ఉంటాయి , వాటి ప్రభావం అవి తీసిన డైరెక్టర్ మీద ఎలా పడుతుంది అంటే డైరెక్టర్ తేజ కి బాగా అనుభవం ఉంది. తన కెరీర్ లో ప్రేమ కథలని నమ్ముకుని అడ్డంగా బుక్ అయిన తేజ కొత్త సినిమా తీయడానికి చాలా కాలం ఎదురు చూసారు.


ఇక హిట్ సినిమా తీయడం కోసం అయితే దశాబ్దం పైనే  పట్టింది ఈ డైరెక్టర్ కి. తాజాగా విడుదల అయిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం తేజ కి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, ఆయన కెరీర్ కే సూపర్ ఊపుని అందించింది ఈ సినిమా. మొన్న జరిగిన థాంక్స్ మీట్ లో సైతం తన కెరీర్ నేనే రాజు కి ముందూ నేనే రాజు కి తరవాత అంటూ రెండు రకాలు అని ప్రకటించాడు ఆయన.


అయితే నేనే రాజు నేనే మంత్రి హిట్ కొట్టిన వెంటనే చాలామంది నిర్మాత‌లు అడ్వాన్సులు పుచ్చుకొని తేజ ఆఫీసు ముందు క్యూ క‌ట్టారు. కానీ… తేజ మాత్రం అంత తేలిగ్గా లొంగే ర‌కం కాదు క‌దా?


అందుకే… ఒక్క‌రి ద‌గ్గ‌ర కూడా అడ్వాన్సు తీసుకోలేదు. సినిమా విడుద‌లై… హిట్టు టాక్ వ‌చ్చినా ఎవ్వ‌రికీ మాట ఇవ్వ‌లేదు. హిట్ వచ్చినా కూడా తేజ స్టైల్ మారలేదు మరి. తేజ ఓకే అనుకుంటే మూడు సినిమాలకి స్పాట్ లో సంతకం పెట్టి డబ్బులు తీసుకోవచ్చు కానీ తన హిట్టుని కొన్నాళ్ళు కాపాడుకోవాలి అనేది ఇతని స్ట్రాటజీ కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: