తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్.  బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో హీరోగా తన మొదటి సినిమాతోనే దుమ్ముదులిపాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు హిట్, ఫ్లాప్స్ అయినా..గత మూడు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుంది.  
Image result for jai lava kusa stills
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ విజయం సాధించాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  ఈ చిత్రాన్ని కళ్యాన్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తునారు.  ఈ చిత్రానికి సంబంధించి జై, లవ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంతే కాదు జై కి సంబంధించి ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చిత్ర యూనిట్ పేర్కొనడం తెలిసిందే. అయితే ఈ మద్య  ఈ చిత్రం విడుదల తేదీలో మార్పులు జరిగాయనే వదంతులు హల్ చల్ చేశాయి.  ఈ చిత్రం షూటింగ్ కాస్త ఆలస్యంగా నడుస్తుందని..రిలీజ్ డేట్ మారవచ్చని వదంతులు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన  ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.  ‘‘జై లవ కుశ’ విడుదల తేదీ గురించి వస్తున్న వదంతులు వాస్తవం కాదు. ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ‘లవ’ టీజర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తాం’ అని ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: