తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్ కుమార్.  అచ్చమైన తెలుగు వాడైన అజిత్ తమిళంలో ఎక్కువ క్రేజ్ సంపాదించాడు.  ఒకదశలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత గొప్ప ఇమేజ్ అజిత్ కే ఉందనడంలో ఆశ్చర్యం లేదు.  ప్రస్తుతం అజిత్ నటించిన వివేగం తమిళ సినిమా టీజర్  ప్రపంచ రికార్డు నెలకొల్పింది.  
Image result for vivegam stills
గత కొంత కాలంగా అజిత్ నటించిన సినిమాలపై విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వచ్చింది.  ఈ నేపథ్యంలో అజిత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘వివేకం’ టీజర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మూడు నెలల కిందట యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన ఈ టీజర్ ను ఇప్పటివరకు 1.90 కోట్ల సార్లు వీక్షించగా 5,24,872 వేల లైక్స్ పొందింది. ఇప్పటి వరకు  యూట్యూబ్ లో ‘మార్వెలిన్ అవెంజర్స్’ టీజర్ మొదటిస్థానంలో ఉంది.  అలాంటిది ఈ రికార్డ్ అజిత్ నటించిన వివేగం చిత్రం టీజర్ బద్దలు చేసింది.
Image result for vivegam stills
ఈ టీజర్ విడుదలైన మూడేళ్లకు 8 కోట్ల వ్యూస్, 5,24,009 లైక్స్ వచ్చాయి. అయితే, ఈ రికార్డును అజిత్ ‘వివేకం’ కేవలం మూడంటే మూడే నెలల్లో అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతే కాదు మూడు నెలల్లో ఇన్ని లైక్స్ సొంతం చేసుకున్న మొట్టమొదటి చిత్రంగా వివేకం ప్రపంచ రికార్డు సృష్టించినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: