బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ షోలో ఎప్పటికప్పుడు సర్ ప్రైజెస్ ఇస్తున్నాడు హోస్ట్ ఎన్టీఆర్. ఈ వారం హీరో నవదీప్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓటింగ్ లో పాల్గొన్నవాళ్లంతా దాదాపు అర్చన ఇంట్లో ఉండొద్దని తేల్చిచెప్పారు.

Image result for archana bigg boss

          వచ్చే వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో 9మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో 8 మంది అర్చనకు వ్యతిరేకంగా ఓటేశారు. అర్చన బిహేవియర్ సరిగా లేదని.. పట్టుకున్న అంశాన్ని పదేపదే లాగుతూ సభ్యులను ఇరిటేట్ చేస్తోందని సభ్యులందరూ మూకుమ్మడి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Image result for archana bigg boss

          9 మంది ఓటేస్తే 8 మంది తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తానేం తప్పు చేశానంటూ అంతర్మథనంలో పడింది. తాను ఎంతో ఇష్టపడే వాళ్లు కూడా తనకు వ్యతిరేకంగా ఓటేయడంపై అర్చన ఆవేదన వ్యక్తం చేసింది.

Image result for archana bigg boss

          అర్చన తర్వాత అత్యధికంగా 5 ఓట్లు ధన్ రాజ్ కు పడ్డాయి. దీంతో అర్చన, ధన్ రాజ్, ముమైత్, హరితేజ వచ్చేవారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ముమైత్, హరితేజ గతవారం స్వచ్చంధంగా ఎలిమినేషన్ కు నామినేట్ చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: