ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఒకేరోజు టాప్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి..అయితే కథ బాగుంటే ఎలాంటి చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సార్లు రుజువు చేశారు. గత కొంత కాలంగా చిన్న చిన్న చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది..అప్ కమింగ్ హీరోలు తమ సత్తా చాటుతున్నారు.  ఇక ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు దాటి..ఈ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ మొన్నటి శుక్రవారం ‘లై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  
Image result for lie movie stills
అయితే ఈ చిత్రంలో ట్విస్ట్ ఏంటంటే..గత కొన్ని రోజులుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించడం.  ఈ సందర్భంగా చిత్రం గురించి మాట్లాడిన అర్జున్ 150 సినిమాల్లో నటించిన హీరోగా నాకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. అందుకు దర్శకులు రాఘవపూడి నన్ను విలన్ గా నటించండి..చాలా బాగుంటుందని అన్నారు. అయితే ఇప్పటి వరకు హీరోగా నటించిన నన్ను విలన్ గా అభిమానులు ఆదరిస్తారా..అన్న అనుమానం కలిగింది.
Image result for lie movie stills
ఏదైనా కొత్త పాత్రలో నటించినప్పుడే ఏదైనా కొత్తగా చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. లై సినిమాలో నటించడం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. హను రాఘవపూడి వచ్చి కథ చెప్పగానే నచ్చింది. కానీ విలన్‌గా చేయడం అంటే నేను ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు సంబంధించి చాలా విషయాలు ముడిపడి ఉంటాయి.  
Image result for lie movie stills
సినిమాలో మన పాత్ర ఔన్నత్యం గురించి ఆలోచించాలి తప్ప విలన్, హీరో అన్న విషయం గురించి కాదని అర్థమైంది.  అలాంటప్పుడు ఎందుకు విలన్‌గా నటించకూడదనిపించింది. నితిన్‌తో అల్రెడి నటించాను. నటుడుగా తను మంచి హార్డ్‌వర్కర్‌.. తనంటే చాలా ఇష్టం  అందుకే లై సినిమా చేశాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదనిపించింది.  త్వరలో అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంలో కూడా విలన్ గా నటించబోతున్నట్లు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: