తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు బాలకృష్ణ.  గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా పాత్రలు కేవలం ఆయన మాత్రమే నటించగలరు అని ఎన్నో సార్లు నిరూపించారు.  లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తో రికార్డులు నెలకొల్పారు.  
Image result for paisa vasool movie stills
ఇక ఆయన కెరీర్ లో వందవ చిత్రం ‘గౌతమి శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించారు.  ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101 ‘పైసా వసూల్’ చిత్రంలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది.  ఈ చిత్రంలో బాలయ్య కొన్ని ఫైట్ సీన్లు కూడా డూప్ లేకుండా నటించినట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. ఇక బాలయ్య సరసన శ్రియ నటిస్తున్నారు.  

ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, వీడియో మేకింగ్ లు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.  తాజాగా ఈ చిత్రంలోని ‘పైసా వసూల్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.  ఈ పాటలో బాలయ్య ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.  పూరి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: