బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జయ జానకి నాయకా. మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయ్యింది.  మంచి మౌత్ టాక్ తో బోయపాటి మార్క్ సినిమాగా వచ్చిన ఈ జయ జానకి నాయకా సినిమా కథ బోయపాటి శ్రీను ఇప్పుడు అనుకున్నది కాదట.


భద్ర తర్వాత తులసి తీస్తున్న టైంలోనే ఈ కథ వచ్చిందట బోయపాటి శ్రీనుకి. అయితే అప్పుడు తులసి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ కు లైన్ చెప్పాడట. అయితే అప్పుడు అనుకున్న కథకు ఇప్పటి సినిమా రూపం వచ్చిందని చెప్పారు. కథని డెవెలప్ చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా దాన్ని బాగా మైండ్ లోకి ఎక్కించుకున్నారట బోయపాటి శ్రీను.


అందుకే సినిమా ఇంత బాగా వచ్చిందని అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కు ఓ సినిమా చేస్తానని కమిట్ అవడం ఇంతలోనే ఈ సినిమా కథ మళ్లీ తెరమీదకు రావడంతో జయ జానకి నాయకా సినిమా వచ్చిందని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందని తెలుస్తుంది.


లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో తీసిన జయ జానకి నాయకా కూడా తన పవర్ ఏంటో చూపించాడు. పోటీగా పెద్ద సినిమాలు రెండు ఉన్నా సరే బోయపాటి చేసిన ధైర్యం ఇప్పుడు వసూళ్ల రూపంలో చూపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: