బిగ్ బాస్ షో ఇంట్రస్టింగ్ గా మారుతోంది. 30రోజు బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇవ్వడంతో సభ్యులందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అయితే టాస్క్ లో భాగంగా దీక్ష చేసిన ఓ పని అందరినీ షాక్ కు గురిచేసింది.

Image result for navadeep, deeksha in bigg boss

ఇంటి సభ్యులకు టాస్క్ లివ్వడం బిగ్ బాస్ కు కామన్. ఇందులో భాగంగా సోమవారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చాలా వెరైటీగా ఉంది. ఇంటి మొత్తాన్ని హోటల్ గా మార్చేశారు. అందులో నవదీప్, దీక్ష జంటగా అడుగుపెడతారు. వారిద్దరికీ సేవలు చేయడం మిగతా ఇంటి సభ్యుల పని. వారు ఏవి అడిగినా కాదనకుండా ఇంటి సభ్యులు చేయాలి. ఇదీ రూల్.

Image result for navadeep, deeksha in bigg boss

అతిథులు కావడంతో ఇంటిసభ్యులు కూడా అడిగినవన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా దీక్ష మసాజ్ కావాలని కోరింది. అందులోనూ శివబాలాజీ మాత్రమే చేయాలని అడిగింది. అంతేకాక.. బొడ్డుకిందివరకూ శివబాలాజి పింక్ టవల్ కట్టుకుని మసాజ్ చేయాలని కోరింది. అందుకు అంగీకరించిన శివబాలాజీ, మసాజ్ చేస్తుండగా తొడల నుంచి చేయాలని కోరింది. దీంతో శివబాలాజీ మసాజ్ చేశాడు.

Image result for navadeep, deeksha in bigg boss

మరోవైపు నవదీప్ కూడా మొదట ధన్ రాజ్ తో కాసేపు మసాజ్ చేయించుకున్నాడు. సరిగా చేయలేదంటూ అర్చనను పిలిచాడు. ఆమెతో కాసేపు చేయించుకున్నాడు. ఆ తర్వాత కాలి వెంట్రుకలను నోటితో పీకాలంటూ అర్చనను నవదీప్ కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించింది.

Image result for navadeep, deeksha in bigg boss

ముమైత్ ను నోటితో గుమిలి తీయాలన్నాడు. ఇందుకు ముమైత్ నిరాకరించింది. ఇలా ఇంటిసభ్యులందరినీ నవదీప్, దీక్షలు ఆటాడుకుంటున్నారు. తమకు నచ్చినవి చేయించుకుంటున్నారు. నవదీప్, దీక్షల వ్యవహారంపై ఇంటిసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: