బిగ్ బాస్ హౌస్ లో సభ్యులకు సీక్రెట్ టాస్క్ లు ఇవ్వడం తెలిసిందే. ఈవారం కూడా ఇద్దరికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ సీక్రెట్ టాస్క్ లో గెలిస్తే వారిద్దరూ వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి వైదొలుగుతారు. అంటే వచ్చే రెండువారాల వరకూ వారిద్దరూ సేఫ్ గా ఉండొచ్చు. మరి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఏంటి.. ఆ టాస్క్ ఎవరికిచ్చారు..?

Image result for bigg boss telugu navadeep

          బిగ్ బాస్ ఈ వారం నవదీప్, దీక్షలకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ ను హోటల్ గా మార్చేసిన బిగ్ బాస్.. అందులో నవదీప్, దీక్షలను అతిథులుగా ప్రవేశపెట్టారు. వీరిద్దరికీ ఇంటి సభ్యులందరూ సేవలు చేసుకోవాలి. వీరు ఏది అడిగినా వారు కాదనకుండా చేయాలి. ఇంటిసభ్యులు అందించే సర్వీస్ ను బట్టి అతిథులిద్దరూ వారికి ర్యాంకులు కేటాయిస్తారు. వారి సేవలందించేదాన్ని బట్టి వారికి స్టార్స్ అందుతాయి.

Image result for bigg boss telugu

          అయితే ఇంటి సభ్యుల్లో కనీసం ముగ్గురిని సేవలందించకుండా చేసుకోవాలని బిగ్ బాస్ నవదీప్, దీక్షలకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అంటే వీరు ఏదైనా చేయాలని అడిగితే ఇంటి సభ్యులు మేం ఇది చేయం అనాలి. అలా ముగ్గురి చేత అనిపించుకోగలగితే నవదీప్, దీక్షలు వచ్చేవారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి సేఫ్ గా బయటపడతారు.

Image result for bigg boss telugu

          ఈ సీక్రెట్ టాస్క్ వల్లే నవదీప్, దీక్షలు తమకు నచ్చినవన్నీ చేయించుకుంటున్నారు. కొంతమంది వాటిని చేసేందుకు నిరాకరించగా.. మరికొందరు మాత్రం ఏది అడిగినా ఠక్కున చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకూ ఇద్దరు సేవలందించేందుకు నిరాకరించారు. మూడోవ్యక్తికోసం నవదీప్, దీక్షలు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: