మెగా మేనల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మెగా స్టార్ చిరంజీవి ఎనర్జీకి ప్రతిరూపంగా ఉంటాడు అన్న కామెంట్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. దీనికితోడు ఈ యంగ్ హీరో ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ తన క్రేజ్ ఏమాత్రం తగ్గిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ  మీడియా దృష్టిని ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా  నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా హైదరాబాద్ లోని సీఆర్ క్వార్టర్స్ లోని ఒక బెటాలియన్ తో మెగా హీరో సాయిధరమ్ తేజ్  తన అనుభవాలను అదేవిధంగా సినిమా విషయాలను పంచుకున్నాడు. 

ఈసందర్భంగా  ఈకార్యక్రమానికి వచ్చిన అనేక మంది ఉద్యోగులు అడిగిన పలు ప్రశ్నలకు సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని అంటూ ఆమె చాలబాగుంటుందని, కామెంట్ చేసాడు. అంతేకాదు సమంతకు నాగచైతన్య కు ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని తేజు జోక్ చేయడంతో  అక్కడ ఉన్న అధికారులు అంతా తెగ నవ్వుకున్నారని టాక్. 

ఇదే సందర్భంలో తేజు మాట్లుడుతూ తనకు  ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని అంటూ  తనకు బాగే నచ్చే హీరోలలో తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.  మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే  తానూ రవితేజతో కలిసి నటించేందుకు తాను ఇష్టపడుతున్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు.  

ఈసందర్భంగా తన మొదటి హీరోయిన్ రెజీనా గురించి ప్రస్తావిస్తూ తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదరడంతో మీడియా ఏదో ఊహించుకుని తమ మధ్య వార్తలు రాసిందని కామెంట్ చేసాడు. ఇది ఇలాఉండగా ప్రస్తుతం తేజు కెరియర్ అంత స్పీడు గా లేక పోయినా వరస పెట్టి అతడికి వస్తున్న ఆఫర్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. 

కొద్దిరోజుల క్రితం వినాయక్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు సాయిధరమ్ తేజ్. ఈరోజు మరో సినిమా ప్రారంభించాడు. కరుణాకరన్ సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఈరోజు కొత్త సినిమా లాంచ్ అయింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రానుంది ఈ మూవీ. కరుణాకరన్ రాసిన కథ ఇలా  తనకు వస్తుంది అని కలలో కుడా అనుకోలేదు అంటూ సాయి ధరం తేజ్ మంచి జోష్ పై ఉన్నాడు. ‘తొలిప్రేమ’ టైపులో ఫ్రెష్ లవ్ స్టోరీగా మూవీ కథ ఉంటుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: