బాలీవుడ్ లెజెండ్..సీనియర్ నటులు దిలీప్‌కుమార్(94) తీవ్ర అనారోగ్య సమస్యలతో ముంబైలోని లీలావతి హాస్పిట‌ల్ లో చికిత్స పొందిన‌ సంగ‌తి తెలిసిందే.  గత కొంత కాలంగా దిలీప్‌కుమార్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  ఈ మద్య ఆయన పరిస్థితి కాస్త సీరియస్ కావడంతో లీలావతి హాస్పిటల్ ఐసియూలో చికిత్స అందించారు.  డీహైడ్రేషన్, మూత్రనాళ సమస్యతో సతమమవుతున్న బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌కి ప‌లు వైద్య‌ ప‌రీక్ష‌లు జ‌రిపిన వైద్యులు దిలీప్‌ కుమార్ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అన్నారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రార్థనలు జరిపారు.  ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం కాస్త‌ కుదుట‌ప‌డ‌డంతో నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు. తాజాగా బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ ని సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ కలిశారు.  ఆయన ఆరోగ్యం విషయం మాట్లాడారు..ఈ సందర్భంగా దిలీప్ కుమార్ నుదుటిపై ముద్దు కూడా పెట్టాడు.  

షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ..దిలీప్ కుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని చిన్నప్పుడు ఆయన సినిమాల చాలా చూసేవాడినని అన్నారు.  బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో దిలీప్ కుమార్ అని అన్నారు. దిలీప్ కుమార్ ఇండ‌స్ట్రీకి ఉన్న పెద్ద దిక్కు, మ‌న హిందీ సినిమాకు గురువు అని కితాబిచ్చారు.షారూఖ్ తాజా చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, ఇందులో హీరోయిన్స్ గా క‌త్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: