మహాభారతంలో అర్జునుడికి ఎన్నో బిరుదులు ఉన్నాయి..అందులో ఒకటి ‘సవ్యసాచి’.  అర్జును తన రెండు చేతులతో ఆయుధాలు సందించగలడని యుద్దం చేయగలడని అందుకే అతనిని సవ్యసాచి అని అంటారు.  ఇక తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున..ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నాగ్ వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతుంది.  
Image result for యుద్దం శరణం గచ్చామి
ఈ సంవత్సరం  ప్రేమమ్, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విజయం తో మంచి ఊపుమీదున్నాడు నాగచైతన్య.  అంతే కాదు వరుస సినిమాలతో బిజి బిజిగా ఉన్నారు. త్వరలో తాను ప్రేమించి నటి సమంతను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం మరిముత్తు దర్శకత్వం లో ‘యుద్ధం శరణమ్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసిన చైతు, చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నాడు.  సినిమా ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు.
నాగచైతన్య
నాగ చైతన్య వెనక్కి తిరిగి నిలబడి రెండు చేతుల్లోనూ బాణాలు పట్టుకున్నట్లు ఫస్ట్ లుక్ ఉంది. ఫస్ట్ లుక్ చూస్తే ఇది యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెలుస్తోంది. చాలా కీలకమైన పాయింట్‌తో చందు ఈ కథను సిద్ధం చేసుకున్నాడని సమాచారం. ఫస్ట్ లుక్‌తోనే ఆ కీలకమైన పాయింట్‌ను చెప్పే ప్రయత్నం చేశాడు చందు మొండేటి.   సెప్టెంబర్ నెల నుండి 'సవ్య సాచి' సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: