ఒకప్పుడు మార్కెటింగ్ చేయాలంటే ఇంట్లో వారి హడావుడి..ప్రయాణ ఖర్చులు..ఇతర ఖర్చులతో పాటు ఎంతో వ్యయప్రయాసలు భరించాల్సి ఉండేది.  కానీ ఇప్పుడు కాలం మారింది..మన ఇంట్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే చాలు మనకు కావాల్సినవి ఇంటి వద్దకే వచ్చే పరిస్థితి నెలకొంది.  ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ-కామర్స్‌ పోర్టల్‌ సామ్రాజ్యం అయ్యింది. అంతే కాదు వీటిలో పోటీలు కూడా ఎక్కువే అయ్యాయి..అందుకే వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ..ఆకర్షిస్తున్నారు. ప్రముఖ ఈ-కామర్స్‌ పోర్టల్‌ స్నాప్‌ డీల్‌ ట్వీట్‌ కు టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.  
Image result for rahul ravindran chinmayi
స్నాప్‌ డీల్‌ ప్రచారంలో భాగంగా మహిళల షాపింగ్‌ నుద్దేశించి ‘జజ్బా’ సినిమాలో ఐశ్వర్యరాయ్‌ పరుగెడుతున్న వీడియోను పోస్ట్‌ చేసి, దానితోపాటు ‘ఎంత షాపింగ్‌ చేసిందో భర్త తెలుసుకునే లోపే.. మహిళ ఇలా డోర్‌ దగ్గరకు పరిగెడుతుంది’ అన్న వ్యాఖ్యను జోడిస్తూ, ఇది మీకు వర్తిస్తుందా? అని వినియగదారులను ట్వీట్‌ ద్వారా ప్రశ్నించారు.  ఈ ట్వీట్ కి రాహుల్ రవీంద్ర..అదేనండీ ప్రముఖ సింగర్ చిన్మయి భర్త కాస్త ఘాటుగా స్పందించాడు.
Related image
గత సంవత్సరం నా సంపాదన కన్నా నా భార్య సంపాదించిందే ఎక్కువ..అంతే కాదు ట్యాక్స్ కూడా ఆమె ఎక్కువ కడుతుంది.  ఇక ఆన్ లైన్ షాపింగ్ కూడా తన సొంత డబ్బుతోనే చేస్తుంది..సో  ఆమెకు ఎక్కడికి పరుగెత్తాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా అని సమాధానం ఇచ్చాడు.  అంతే ఈ ట్విట్ కి చిన్మయి మన హీరో గారికి ఫిదా అయ్యింది. ఇలాంటి భర్తను ప్రతి అమ్మాయి కోరుకుంటుంది' అంటూ ట్వీట్ చేసి మురిసిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: