బిగ్ బాస్ టీవీ షో ఇప్పుడు తెలుగునాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో చూస్తున్నాం మనందరం. కావలసినంత ఫన్ తో పాటు కాంట్రవర్సీలు సైతం ఈ షో స్పెషాలిటీ. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లకి ఎప్పుడూ హ్యాపీగా చేసే మన పార్టిసిపెంట్ లకి ఈ సారి కాస్త షాకింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. రీసెంట్ గా షో లోకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్ తనదైన శైలి లో ఇరగ దీస్తూ వస్తున్నాడు.


బిగ్ బాస్ ఇంటి మొత్తాన్నీ ఒక హోటల్ గా మార్చేసిన ఈ టాస్క్ లో నవదీప్ - దీక్ష ఇద్దరూ గెస్ట్ లు గా ఉంటారు, హోటల్ లో సర్వర్ లు గా మిగితా వారు ఉంటారు. చెఫ్ లుగా హరితేజ, కార్తికా కనిపించగా ప్రిన్స్ మ్యానేజర్ గా కనిపిస్తాడు. ఇలాంటి ఒక టాస్క్ లో నవదీప్ - దీక్ష అడిగిన దానికి దేనికీ నో చెప్పకూడదు .. అయితే దీంతో పాటు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో నవదీప్ , దీక్ష లు నో చెప్పించుకుని తీరాల్సి ఉంటుంది.


దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొన్నాడు న‌వ‌దీప్‌. అర్చ‌న చేత మ‌సాజ్ చేయించుకొన్నాడు. మిగిలిన వాళ్ల‌ని ముప్పు తిప్ప‌లు పెట్టాడు. కాలి వేళ్ల‌కు ఉన్న వెంట్రుక‌ల‌ను నోటితో తీయ్‌.. అని ఆర్డ‌రేశాడు. ఆమె నో చెప్పి పారిపోయింది.


ఆదర్శ్ తో అండర్ వేర్ మీద సర్వీస్ చెయ్యమని కోరాడు నవదీప్ దానికి నిరాకరించడం తో నవదీప్ పాయింట్స్ గెలుచుకున్నాడు. ఇలా రసవత్తరంగా సాగిన ఈ ఎపిసోడ్  సూపర్ హిట్ అయ్యింది. ఆఖర్లో హోటల్ టీం ఈ టాస్క్ ని గెలవగా నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకున్నారు నవదీప్ , దీక్ష. నవదీప్ ఆట అందరికీ విపరీతంగా నచ్చుతోంది, సరిగ్గా పరిస్థితి ని అర్ధం చేసుకుని ఆడుతున్నాడు నవదీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: