టాప్ హీరోయిన్స్ మధ్య ఎంత పోటీ ఉన్నా ఆ పోటీ మధ్య నిలదొక్కుకుంటూ ఇప్పటి వరకు 50 సినిమాలలో నటించిన కాజల్ ఈమధ్య విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను ప్రమోట్ చేస్తూ టాప్ హీరోల పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ ఈ కామెంట్స్ చేసింది. 

టాప్ హీరోలందరితోను నటించిన కాజల్ ఆ టాప్ హీరోల పై ఆటీవి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న యాంకర్ అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చి అందరి మైండ్ బ్లాంక్ చేసింది. జూనియర్ గురించి మాట్లాడుతూ అతడి హైపర్ యాక్టివ్ నెస్ తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ చురకలు వేసిన కాజల్ ప్రభాస్ తన ఎనర్జీని పెంచుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్ చేసింది. 

ఇదే సందర్భంలో ప్రిన్స్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ మహేష్ ‘ఛాటర్ బాక్స్’ అంటూ కొత్త బిరుదు ఇచ్చింది. అదేవిధంగా కోట్లాదిమంది అభిమానులుగల పవన్ గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడితే బాగుంటుంది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. 

ఇలా అందరి హీరోల గురించి మాట్లాడిన కాజల్ ఈవిషయంలో చిరంజీవి రామ్ చరణ్ అల్లుఅర్జున్ ల గురించి కామెంట్స్ చేయకపోవడం ఆశ్చర్యకరం. అయితే కాజల్ సరదాగా చేసిన ఈ కామెంట్స్ ను మహేష్ పవన్ అభిమానులు సీరియస్ గా తీసుకోవడంతో ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 
ప్రస్తుతం కాజల్ టాప్ హీరోయిన్ రేసులో లేకపోయినా ఆ విషయాల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ ఎందుకు కామెంట్ చేసింది అన్నది సమాధానం లేని ప్రశ్న..  


మరింత సమాచారం తెలుసుకోండి: