అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త సినిమా యుద్ధం శరణం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. డీసెంట్ టీజర్ తో అందరి మనసులూ గెలుచుకున్న ఈ టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో పెద్ద సంచలనమే. డైరెక్టర్ కృష్ణ ఆర్వీ ఒక డిఫరెంట్ స్టైల్ లో ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తీసినట్టు చెబుతున్నారు.


లావణ్య హీరోయిన్ గా కనిపించ బోతున్న ఈ సినిమాలో నాగ చైతన్య నటన హై లైట్ కాబోతోంది అంటున్నారు. సెప్టెంబర్ 8 న ఈ సినిమా విడుదల కి సిద్దం అయ్యింది. ఈ డేట్ ముందరే ఇంటర్నెట్ లో వచ్చినా తాజాగా చిత్ర బృందం దీనికి ఓకే చెప్పి ఖరారు చేస్తూ పోస్టర్ లు కూడా విడుదల చేసింది.


ఒక స్పెషల్ పోస్టర్ ని సైతం ఈ విడుదల చేసారు తాజాగా. సాయి కొర్రపాటి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్ గా కనిపిస్తారు .


ఆయన ఆహార్యం స్టైల్ ఇవన్నీ ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ లు అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే చైతూ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. ఈ సినిమా తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ చేయనున్న మూవీకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: