ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను పొందిన మహేష్ పేరు ఎరుగనివారు ఉండరు. అయితే అటువంటి ప్రిన్స్ మహేష్ బాబు ను పరిచియం చేస్తూ నిర్వహించబోతున్న పరిచియ కార్యక్రమమం  ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ నటించిన సినిమాలకు టాక్ ఎలా వచ్చినా  అతడి సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోతాయి.

కానీ కోలీవుడ్ లో పరిస్థితి వేరు. అతడి పేరు తమిళ ప్రేక్షకులకు పరిచియం అయినా అతడికి తమిళ నాట పెద్దగా క్రేజ్ లేదు. అయితే త్వరలో విడుడుదల కాబోతున్న స్పైడర్ తనకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చి పెడుతుంది అని మహేష్ భావిస్తున్నాడు.  అయితే  ప్రస్తుతానికి తమిళనాట ‘స్పైడర్’ ను మురుగదాస్ సినిమాగానే చూస్తున్నారు. మరి ఆడియన్స్ ను మహేష్ వైపు తిప్పాలంటే ఏంచేయాలి అన్న కోణంలో ఆలోచించి ఈమూవీ కోసం చెన్నైలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
తెలుస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 9న చెన్నైలో ‘స్పైడర్’ సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు అని తెలుస్తోంది. ఆకార్యక్రమంలో మహేష్ ను కోలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేయబోతున్నారు. భారీ ఎత్తున జరగబోతున్న ఈకార్యక్రమ స్టేజ్ పైకి మహేష్ ఎలా రావాలి ఎలా కనిపించాలి లాంటి అంశాలపై ఇప్పటికే ఒక స్పెషల్ కాన్సెప్ట్ ను డిజైన్ చేసినట్లు టాక్.

 సాధారణంగా కొత్త హీరోలను పరిశ్రమకు పరిచయం చేసేటప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో పేరు సంపాదించి చాలామంది తమిళ సినీ ప్రముఖులకు సన్నిహితుడైన మహేష్ ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచియం చేస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం హాట్ న్యూస్ గా మారింది.

‘స్పైడర్’ మూవీని తెలుగుప్రేక్షకులకు దగ్గరచేసే ఉద్దేశంతో ఈసినిమాకు సొంతంగా తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు మహేష్. దీనికితోడు తమిళ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ప్రచారంచేయడానికి కూడా మహేష్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ఈసినిమాకు భారీ స్థయిలో కలెక్షన్స్ వస్తేకాని ఈసినిమా బయ్యర్లు గట్టుఎక్కరు. దీనితో ఈసినిమాను తెలుగు తమిళ  భాషలలో కూడ భారీగా ప్రమోట్ చేయబోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: