ఈ మద్య వెండితెరపై వస్తున్న హీరోయిన్స్ కన్నా బుల్లితెరపై కనిపించే యాంకర్స్ కే ఎక్కువ పేరు వస్తుంది.  ఒకప్పుడు యాంకరింగ్ చేసేవారు చాలా సాంప్రదాయంగా కట్టూబొట్టు తో వచ్చి యాంకరింగ్ చేస్తూ ఉండేవారు.  కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది..యాంకర్ అంటే హీరోయిన్ లా ఉందిరో బాబోయ్ అనేలా గ్లామర్ షో చేస్తున్నారు.  ఇక తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో పరిచయం అయిన అనసూయ, రష్మీ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  టాలీవుడ్ లో ఎక్కడ చూసినీ ఈ ముద్దగుమ్మల పేర్లే వినిపిస్తున్నాయి.  
ఇట్స్ ఎ బాయ్? or గర్ల్?
కాస్త సాంప్రదాయంగా కనిపించే సుమ గురించి తెలియని వారు ఉండరు..ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రైవేట్ ప్రోగ్రామ్, ఆడియో వేడుకలైనా సుమ నే కనిపిస్తుంది. అంతే కాదు  సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి వారు సీనియర్ యాంకర్లుగా వాళ్ళ హవా కొనసాగిస్తూనే ఉన్నారు.  ఇక  టీవీ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల ఆ తర్వాత కొన్ని బుల్లితెర సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో పలు టాలీవుడ్ సినిమాల ఆడియో ఫంక్షన్లకు యాంకర్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.

ఇటీవల విడుదలై గోపీచంద్ ‘లౌక్యం', నాగ చైతన్య ‘ఒక లైలా కోసం' చిత్రంల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. గత కొంత కాలంగా శ్యామల  ఆడియో ఫంక్షన్స్, ఇతర టీవీ కార్యక్రమాల్లో కనిపించడమే లేదు..అందుకు కారణం ఆమె గర్భవతి కావడమే..తాజాగా శ్యామలకు పండంటి మగబిడ్డ జన్మనిచ్చింది.  
Image result for యాంకర్ శ్యామల
కొత్త గా వచ్చిన అమ్మతనాన్ని ఇప్పుడే పుట్టిన తన బాబుతో ప్రతి క్షణం ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది.ఫ్యామిలి షో యాంకర్ గా మంచి  పేరు తెచ్చుకున్న శ్యామల సినిమా ఈవెంట్లు ను కూడా అంతే చక్కగా చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: