సెన్సార్ బోర్డు ఎందుకుంటుంది.? సినిమాల్లో ఏవైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే వాటిని కత్తరించేందుకు ఉంటుంది.! సినిమా అన్నాక ఒకటో రెండో కత్తెర్లు వేయడం కామన్. ఒక్కోసారి అవీ ఉండకపోవచ్చు. కానీ ఇండియన్ సెన్సార్ బోర్డు హిస్టరీలో ఒక సినిమాకు 73 కత్తెర్లు పడ్డాయి. ఇదొక రికార్డ్.

kaalakaandi కోసం చిత్ర ఫలితం

బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ చాలా కాలం తర్వాత కాలాకాండి అనే సినిమాలో నటిస్తున్నాడు. అక్షత్ వర్మ ఈ సినిమా దర్శకుడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో సైఫ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.

kaalakaandi కోసం చిత్ర ఫలితం

ఢిల్లీ బెల్లీ సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న అక్షత్ వర్మ ఈ సినిమాకు రచయితగానే కాకుండా దర్శకత్వం కూడా చేపట్టాడు. అయితే ఈ సినిమాలో లెక్కకు మించిన అసభ్య పదాలు ఉన్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ – సీబీఎఫ్సి అభిప్రాయపడింది. ఇలాంటి 73 సన్నివేశాలను తొలగిస్తున్నట్టు చెప్పింది.

kaalakaandi కోసం చిత్ర ఫలితం

73 సన్నివేశాలను కత్తరించడంపై సినిమా యూనిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గతంలో బాబూమోషాయ్ బందూక్ బాజ్ సినిమాకు 40 కత్తరింపులు పడ్డాయి. ఇన్ని కట్స్ పడిన సినిమా ఇప్పటివరకూ లేదు. అయితే పహ్లాజ్ నిహలానీ వైదొలగకముందు కాలాకాండీ సర్టిఫికేషన్ కోసం వెళ్లింది. ఇప్పుడు ప్రసూన్ జోషి సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా వచ్చారు. దీంతో దీనిపై పునఃపరిశీలన చేయొచ్చని సినిమా యూనిట్ నమ్ముతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: