తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే నాలుగు దశాబ్ధాలు దాటింది..అంతే కాదు ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించారు.  ఈ చిత్రానికి యువ దర్శకులు క్రిష్ దర్శకత్వం వహించారు.  తాజాగా నందమూరి బాలకృష్ణ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ‘పైసా వసూల్’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రం ఆడియో వేడుకలు ఖమ్మం జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి.  
Image result for paisa vasool
మొన్న నంద్యాల ఉప ఎన్నికల సందర్భ ంగా బాలకృష్ణ రోడ్ షో లో పాల్గొన్నారు.  సాయంత్రం ఒక హోటల్ లో బస చేయడానికి వెళ్లిన సమయంలో అభిమానులు కోలాహలం ఎక్కువైంది.  ఆ సమయంలో బాలయ్యపై ఓ అభిమానికి చెంప చెల్లుమనిపించడం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన దర్శకులు పూరి కోకాకోలా పెప్సీ ...బాలయ్య బాబు సెక్సీ అని అంటూనే బాలయ్య బాబు తన అభిమానులను కొడితే తప్పు లేదని , బాలయ్య కొట్టిన దెబ్బలను ఫ్యాన్స్ ఇష్టంగా స్వీకరిస్తుంటారని అంటున్నారు. 
Image result for paisa vasool
'' ఇన్నాళ్లు బాలయ్య బాబు తో సినిమా చేయనందుకు చాలా బాధపడ్డానని , ఈ సినిమా బాలయ్య బాబు కి 101 వ సినిమా అయినప్పటికీ మొదటి సినిమాలా ఫీలై చేసాడని.. బాలయ్య బాబుకి బౌన్సర్స్ అవసరం లేదని తనకు ఇబ్బంది కలిగించే వారి సంగతి ఆయనే చూసుకుంటాడని..అప్పుడప్పుడు చెంప చెల్లుమనిపిస్తాడని అన్నారు.
Image result for paisa vasool
 కానీ ఈ విషయాన్ని అభిమానులు ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరని కాకపోతే మీడియాలో రక రకాల కథనాలు మాత్రం వస్తున్నాయని అన్నారు.  బాలయ్య అంటే వాళ్లకు లవ్ కాబట్టి అంటూ కొత్త నిర్వచనం చెబుతున్నాడు. పైసా వసూల్ చిత్ర ఆడియో వేడుక నిన్న ఖమ్మం లో జరిగింది . అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో బాలయ్య తో పాటు పూరి జగన్నాధ్ , నిర్మాత ఆనంద్ ప్రసాద్ , దర్శకులు బోయపాటి శ్రీను , క్రిష్ తదితరులు పాల్గొన్నారు .
  

మరింత సమాచారం తెలుసుకోండి: