తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో ‘జై’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకర్షించుకోలేక పోయాయి. నల్గొండ జిల్లా, పాలెం గ్రామంలో రామారావు, మాధవి దంపతులకు జన్మించాడు . హైదరాబాద్ సఫిల్‌గూడ DAV పాఠశాల లో చదివాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరికతో ఉన్న నవదీప్ అనూహ్యంగా తేజ దర్శకత్వంలో ‘జై’ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు.
Image result for navdeep big boss
 నవదీప్, కాజల్ నటించిన చందమామ చిత్రం కాస్త పరవాలేదు అనిపించింది.  ప్రస్తుతం హీరో గా కాకుండా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు గా వస్తున్నాడు నవదీప్.  ఈ మద్య పట్టుబడిన డ్రగ్స్ ముఠా పట్టుబడిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి లింకులు ఉన్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొంత మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Image result for navdeep drugs
ఈ నోటీసులు అందుకున్న వారిలో నవదీప్ కూడా ఉన్నారు. సిట్ ముందు హాజరయ్యారు..కానీ తన రక్తనమూనాలు మాత్రం ఇవ్వనని అనడం పెద్ద సంచలన వార్త అయ్యింది.  ప్రస్తుతం నవదీప్ తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: