ఈసారి వచ్చేనెల రాబోతున్న దసరా పండుగ మహేష్ జూనియర్ ల మధ్య వార్ గా మారిన నేపధ్యంలో ఈ వార్ లో ఎవరు దసరా విజేత అవుతారు అన్న విషయమై రకరకాల అంచనాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. అయితే దసరాకి జరుగుతుంది అనుకున్న ఈవార్ ఇప్పుడు అనూహ్యంగా వినాయక చవితికి ఒక ఆసక్తికర టర్నింగ్ తీసుకోవడం ఆశ్చర్య కరంగా మారింది. 

‘స్పైడర్’ మొట్టమొదటి టీజర్ సాధించిన రికార్డులను ఆ తరువాత విడుదలైన ‘జై లవ కుశ’ టీజర్ బ్రేక్ చేయడమే కాకుండా దక్షిణాది టాప్ హీరోల టీజర్ రికార్డులను కూడ ‘జై లవ కుశ’ దాటిపోయింది అన్న విషయాలు తెలిసినవే. ఆతరువాత ‘స్పైడర్’ రెండవ టీజర్ విడుదల అయినా అది మహేష్ అభిమానులను కూడ పూర్తిగా మెప్పించలేకపోయింది. ఈ పరిస్థుతులలో జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడానికి ‘స్పైడర్’ మూడవ టీజర్ ను వచ్చేవారం వినాయకచవితి రోజున విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇదే వినాయక చవితిని టార్గెట్ చేస్తూ ‘జై లవ కుశ’ కు సంబంధించి మరో టీజర్ ను కూడ ఇదే వినాయక చవితి రోజున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో దసరాకు జరగవలసిన మహేష్ జూనియర్ల వార్ ఇంకా చాల ముందుగానే వినాయకచవితినాడు జరగబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలకు మహేష్ జూనియర్లకు ఉన్న క్రేజ్ రీత్యా అత్యంత భారీ బిజినెస్ జరిగింది. అయితే వరస విజయాలతో దూసుకుబోతున్న జూనియర్ ‘జై లవ కుశ’ తో పోటీ పడుతున్న మహేష్ ‘స్పైడర్’ ఏమాత్రం వెనకడుగు వేసినా అది మహేష్ భవిష్యత్ సినిమాల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: