మరి కొద్ది రోజులలో పెళ్ళి కూతురుగా మారబోతున్న సమంత ప్రస్తుతం తాను చేస్తున్న 6 సినిమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉండటమే కాకుండా మధ్యలో చైతూతో తన పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లను చక్కదిడ్డుతూ తెగ బిజీగా ఉంది. అయితే ఇంత బిజీలో కూడ సమంత సోషల్ మీడియాలో సందడి చేయడం ఏమాత్రం తగ్గ లేదు.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అనుభవాలను ఆలోచనలను అభిమానులతో షేర్ చేసుకుంటూ సందడిగానే కాలం గడుపుతోంది సమంత. ఈ పరిస్థుతులలో ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఓ విడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

త్వరలో జరగబోతున్న తన పెళ్ళిలో అందమైన పెళ్లి కూతురులా కనిపించడానికి సమంత తన క్యాలరీలు బాగా బర్న్ చేసుకుంటూ జిమ్ లో తెగ కష్టపడుతూ వర్కౌట్స్ చేస్తోందట. ఒక బంతితో ఆమె చేస్తున్న వ్యాయామం చాల కొత్తగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సింగిల్ హ్యాండ్ పుషప్స్ ఇలా ఆసక్తికరంగా చేస్తూ ఇక పెళ్ళికి కూడా కొద్దీ రోజులు మాత్రమే మిగిలి ఉంది బాగా కష్టపడాలి అంటూ తెగ వర్కౌట్ చేస్తోంది సమంత. ఈమె వర్కౌట్ చేస్తున్న తీరును చూస్తుంటే సమంత జిమ్ వర్కౌట్స్ స్ఫూర్తిగా తీసుకుని రానున్న రోజులలో చాలామంది పెళ్లి కూతుళ్ళు ఇలా తెగ కష్టపదతారనుకోవాలి. 

తన పెళ్ళి పూర్తి అయిన తరువాత కేవలం వారంరోజులు గ్యాప్ మాత్రమే తీసుకుని తిరిగి షూటింగ్ లకు వచ్చేస్తాను అని ఈమె చెపుతున్న మాటలు విన్నవారు సమంతలోని ప్రోఫిషనల్ యాటిట్యూడ్ ను చూసి తెగ ప్రశంసిస్తున్నారు. ఈమె స్పూర్తిని చూస్తూ ఉంటే రానున్నరోజులలో నాగార్జునను మించిపోయే బిజినెస్ ఉమెన్ గా మారిపోయినా ఆశ్చర్యం పడనవసరం లేదు అని అనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: