అక్కినేని న‌వ‌మ‌న్మ‌థుడు అఖిల్ లేటెస్ట్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మ‌నం, ఇష్క్‌, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ విష‌యంలో చాలా ఉత్కంఠ నెల‌కొంది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ త‌ర్వాత నాగార్జున‌, అఖిల్‌, అటు డైరెక్ట‌ర్ వినాయ‌క్ చాలా రోజుల పాటు బ‌య‌ట‌కే రాలేదు.

akhil akkineni కోసం చిత్ర ఫలితం

ఇక  ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రెండు రోజుల క్రిత‌మే లీక్ అయ్యింది. ఈ లుక్‌తోనే అంచ‌నాలు పెరిగిపోగా ఇప్పుడు నాగార్జున సినిమా టైటిల్‌పై ట్విట్ట‌ర్లో హింట్ ఇచ్చారు. నాగార్జున - అమ‌ల జంట‌గా ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నిర్ణ‌యం సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘హలో గురు ప్రేమకోసమే జీవితం’ పదాలలో అఖిల్ కొత్త సినిమా టైటిల్ దాగుందని నాగార్జున తెలిపాడు.


నాగ్ ఈ హిట్ ఇచ్చిన వెంట‌నే అక్కినేని అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు ఈ సినిమా టైటిల్‌పై ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు కామెంట్లు పెడుతున్నారు. ‘హలో గురు’ మరియు ‘ప్రేమకోసమే జీవితం’ .. ఈ రెండింటిలో ఏదోఒకటి టైటిల్ అయి ఉంటుందని ఊహిస్తున్నారు. 

nirnayam telugu movie కోసం చిత్ర ఫలితం

వీళ్లు ఇలా కామెంట్లు పెడుతుంటే ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్రకారం ఫిల్మ్ ఛాంబర్ లో ‘హలో’ అనే టైటిల్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక అఖిల్ త‌ర్వాత సినిమా బోయ‌పాటి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌ని మ‌రో టాక్ వ‌స్తోంది. అయితే బోయ‌పాటి బాల‌య్య‌, చిరుతో క‌మిట్ అవ్వ‌డంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: