నితిన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా లై. 14 రీల్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ అయ్యింది. అదే రోజు రిలీజ్ అయిన మిగతా రెండు సినిమాల కన్నా లై వెనుకపడ్డదని చెప్పొచ్చు. నితిన్ రేంజ్ పెంచే సినిమాగా దాదాపు 35 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చింది ఈ సినిమా.


అఆతో 50 కోట్ల మార్క్ అందుకున్న నితిన్ సినిమా లై బడ్జెట్టే 35 కోట్లు పెట్టేశారు. అయితే నితిన్ రేంజ్ పెరిగిందని అనుకోగా అఆతో వచ్చిన హిట్ అది త్రివిక్రం వల్ల వచ్చిందని తెలుస్తుంది. కేవలం నితిన్ స్టామినా ప్రూవ్ చేసే అవకాశం వచ్చినా సరే రేసులో పూర్తిగా వెనుకపడ్డాడు. సినిమా మొత్తం యూఎస్ లో షూట్ చేయడంతో ఖర్చు తడిసి మోపెడయ్యింది. 


ప్రొడక్షన్ ఖర్చే సినిమా బడ్జెట్ కు భారమయ్యేలా చేసింది. అడ్వెంచర్ రీతిలో సినిమా నడిపించాలని తీసినా ఈసారి హను మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మణిశర్మ మళ్లీ ఈ సినిమాతో ఫాంలోకి వచ్చేసినట్టే అనుకోవచ్చు. హీరో అర్జున్ విలన్ గా చేసినా అంతగా లాభం లేకుండా పోయింది. 


లై కలక్షన్స్ కూడా డల్ గా ఉన్నాయి. సినిమా బడ్జెట్ లో సగం రికవర్ అవుతుందేమో అంటున్నారు. అఆతో అదిరిపోయే హిట్ అందుకున్న నితిన్ లైతో నిరాశ పరచాడనే చెప్పాలి. మరి నితిన్ తర్వాత సినిమా అయినా హిట్ కిక్ ఇస్తుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: