సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. 130 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తమిళంలో స్పైడర్ తో మహేష్ అక్కడ ఇంట్రడ్యూస్ అవబోతున్నాడు.


సెప్టెంబర్ 8న గ్రాండ్ ఈవెంట్ తో మహేష్ కు తమిళ పరిశ్రమకు పరిచయం చేయబోతున్నారు. నిర్మాతలు ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ కు తలైవా సూపర్ స్టార్ రజినికాంత్ అతిధిగా వస్తున్నారని తెలుస్తుంది. రోబో డైరక్టర్ శంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారట. స్పైడర్ తెలుగు తమిళ రెండు భాషల్లో బైలింగ్వల్ గా తెరకెక్కుతుంది.


మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ లో మురుగదాస్ అసలు కథను రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు.


మరి మహేష్ ఈవెంట్ కు రజిని వచ్చి సపోర్ట్ ఇచ్చాడంటే స్పైడర్ కు తమిళంలో కూడా పెద్ద మార్కెట్ వచ్చేసినట్టే. మురుగదాస్ అక్కడ స్టార్ డైరక్టర్ కాబట్టి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: