'అ ఆ' తో తన స్థాయిని పెంచుకుని 50 కోట్ల హీరోగా మారిన నితిన్ కు ఎందరో దర్శకులు తమ కథలను వినిపిస్తే అవన్నీ వద్దనుకుని ఎంతో ఆశ పెట్టుకుని నటించిన ‘లై’ మూవీ రిజల్ట్ నితిన్ కు ఊహించని ఎదురు దెబ్బగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘లై’ తో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని నితిన్ చేసిన ప్రయోగం ఘోరంగా విఫలం అవ్వడంతో ప్రస్తుతం నితిన్ పరిస్థితి అయోమయంలో ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండిపెండెన్స్ డేకి వచ్చిన వరస సెలవలను టార్గెట్ చేయాలని నితిన్ తన ‘లై’ ని మిగతా సినిమాల పోటీని కూడ లెక్క చేయకుండా మితిమీరిన ధైర్యంతో చేసిన సాహసం నితిన్ కు శాపంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాతో పోటీగా విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ జయజానకీ నాయక’ సినిమాలతో పోల్చుకుంటే నితిన్ ‘లై’ అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను ఇలా ఎవర్ని మెప్పించలేక బాక్సాఫీస్‌ వద్ద ఘోరమైన తిరస్కారానికి గురైంది.

అంతేకాదు ఈమూవీ నితిన్ సినిమాలలోనే అతి పెద్ద ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో చాల జిల్లాలలో ఈసినిమాను ప్రదర్శిస్తున్న ధియేటర్స్ యాజమాన్యాలు ఈసినిమాకు
రేపటి నుంచి కనీసపు కలక్షన్స్ అయినా ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు టాక్. ఈసినిమా నెమ్మదిగా పుంజుకుంటుందని నితిన్ పెట్టుకున్న ఆశలు కూడ ఈ వీకెండ్ లో ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. 

యంగ్ హీరోలు నాని నాగచైతన్య శర్వానంద్ లతో పాటు వరుణ్ తేజ్ కూడ సక్సస్ బాట పట్టిన నేపధ్యంలో నితిన్ ఈ ఘోరమైన ఫ్లాప్ వల్ల ‘అ ఆ’ తో వచ్చిన ఇమేజ్ ని అంతా పోగొట్టుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో నితిన్ సాహసం చేసి తాను సొంతంగా ఒక సినిమాను తీసినా ఆ సినిమా మార్కెట్ అయ్యే పరిస్థుతులలో లేదు అన్న కామెంట్స్ కూడ నితిన్ కెరియర్ పై పడుతున్నాయి. నితిన్ తో పాటుగా దర్శకుడు హను రాఘవపూడికి కూడ ఈమూవీ ఫెయిల్యూర్ ఊహించని షాక్ గా మారిన నేపధ్యంలో హను రాఘవ పూడి వైపు చూసే యంగ్ హీరోలు కూడ ప్రస్తుతానికి ఎవరు ఉండకపోవచ్చు..  


మరింత సమాచారం తెలుసుకోండి: