హీరో రామ్ చరణ్ భార్యగా కాకుండా ఉపాసనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మంచి బిజినెస్ ఉమెన్ గా దూసుకు వెళ్ళిపోతున్న ఉపాసన తన మామగారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. అంతేకాదు తన మామయ్యా చిరంజీవికి ఇచ్చిన ప్రామిస్ ను కూడ బయట పెట్టింది. 

తన మామయ్యా చిరంజీవి తనకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ రామ్ చరణ్ అని అంటూ తన మామయ్యా పుట్టినరోజు సందర్భంగా తన చిరంజీవి ఫ్యామిలీని అదేవిధంగా చరణ్ ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుతాను అని తాను మాట ఇచ్చిన విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదు తన మామయ్యా చిరంజీవికి తనంటే విపరీతమైన ప్రేమ అని చెపుతూ తాను ఏపని చేసినా చాలా సమర్ధవంతంగా చేస్తానని చిరంజీవి నమ్మకం అని చెపుతూ తనను ఇంకా బెటర్ గా చేయమని నిరంతరం ప్రోత్సహిస్తూ చిరంజేవి ఉంటారు అన్న విషయాన్ని బయటపెట్టింది ఉపాసన. 

ఇక చిరంజీవి రామ్ చరణ్ లమధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ ఆ అనుబంధాన్ని ఒక తల్లి కాని లేదా భార్య కాని లేదా సోదరి కాని చెప్పలేరు అని అంటూ ప్రతి తండ్రి తన కొడుకు నుండి కోరుకునే ప్రేమను మించి వంద రెట్ల ప్రేమను చరణ్ చిరంజీవి పై తన గుండెల నిండా నింపుకున్నాడు అంటూ చరణ్ చిరంజీవిల సాన్నిహిత్యం పై కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె తన అత్త సురేఖ గురించి మాట్లాడుతూ ఆమె తన కూతుళ్ళను మించి ప్రేమిస్తుందని చెపుతూ తాను ఆప్యాయంగా తన ఇంటినుంచి తెచ్చుకున్న మూగ జీవాలను కూడ తన అత్త మామలు ఎంతో అభిమానంగా చూస్తారు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది ఉపాసన.

తన తల్లి శోభన కామినేని ఒక జాతీయ స్థాయి స్క్యాష్ ప్లేయర్ అయిన నేపధ్యంలో ఆమె అల్లుడుగా ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు తన తండ్రి జమిందారీ కుటుంబం నుండి వచ్చిన నేపధ్యంలో అలాంటి కుటుంబానికి చెందినా అబ్బాయి అల్లుడుగా వస్తాడని చాలామంది అనుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంది ఉపాసన. అయితే తాను చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు తన కుటుంబ సభ్యులు మొదట్లో షాక్ అయినా వారు తన అభిప్రాయాన్ని మన్నించి తాను కోరుకున్న ‘మిస్టర్ సి’ తో పెళ్లి చేసి తన జీవితం బాగుండాలని తన తల్లితండ్రులు ఆశించిన స్థాయికి కొన్ని వందల రెట్లు తన జీవితం ప్రస్తుతం మెగా కుటుంబ కోడలుగా అత్యంత ఆనందంతో గడుస్తోంది అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచింది ఉపాసన..  



మరింత సమాచారం తెలుసుకోండి: