గత సంక్రాంతి రేస్ కు బాలకృష్ణ చిరంజీవి సినిమాలు పోటాపోటీగా విడుదలైన నేపధ్యంలో బాలకృష్ణ ‘శాతకర్ణి’ పై చిరంజీవి ‘ఖైదీ’ పైచేయి సాధించడమే కాకుండా దాదాపు 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను కూడా చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ కొల్ల గొట్టింది. దీనితో బాలకృష్ణ అభిమానులు కొంత వరకు దిగాలు పడిన మాట వాస్తవం. 

అయితే అనూహ్యంగా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘పైసా వసూల్’ ఇంకా విడుదల కాకుండానే ‘ఖైదీ నెంబర్ 150’ రికార్డులకు ఊహించని విధంగా చెక్ పెట్టడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రస్తుత ట్రెండ్ లో ఏసినిమా ఎన్ని రోజులు ఆడింది అన్న రికార్డుల కంటే ఆమూవీకి ఎన్ని కోట్ల కలక్షన్స్ వచ్చాయి అదేవిధంగా ఆ మూవీ టీజర్ కు ఎన్ని లక్షల క్లిక్స్ - లైక్స్ వచ్చాయి అన్న ప్రాతిపదిక పై ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నడుస్తోంది.

ఇక లేటెస్ట్ గా అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ బాలకృష్ణ ‘పైసా వసూల్’ విడుదల కాకుండానే సంచలనాలు సృష్టిస్తోంది. ఈమూవీ థియేట్రికల్ ట్రయిలర్ విడుదలయిన 24గంటల్లో 2.9 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయంలో టాప్ త్రీ ప్లేస్ ను సాధించింది అని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో వున్న చిరు ‘ఖైదీ నెంబర్ 150’ ని నాలుగో ప్లేస్ కు తోసేసింది ‘పైసా వసూల్’.

చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ 24గంటల్లో 2.4మిలియన్ల వ్యూస్ సాధించింది. ఫస్ట్ ప్లేస్ లో ‘బాహుబలి 2’  21.7 మిలియన్లు క్లిక్స్ తో ప్రధమ స్థానంలో ఉంటే ‘డిజే’ 4.6 మిలియన్ల హిట్స్ తో రెండవ స్థానంలో ఉంది. బాలకృష్ణ ‘పైసా వసూల్’ మూడవ స్థానంలో ఉంటే చిరంజీవి ‘ఖైదీ’ నాల్గవ స్థానంలోను పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’ 2.16 మిలియన్ తో అయిదో ప్లేస్ లో ఉంది. దీనితో ఈ ఊహించని షాక్ జోష్ లో నందమూరి అభిమానులు అయోమయంలో చిరంజీవి అభిమానులు ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: