సరిగ్గా మూడు రోజుల్లో అంటే ఆగస్ట్ 23 న పెళ్లి కూతురు కాబోతోంది హీరోయిన్ ప్రియమణి. దక్షినాది లో చాలా సినిమాలు చేసిన ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ప్రేక్షకులకి సుపరిచితమే.


బిజినెస్ మ్యాన్ ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకోబోతున్న ఆమె పెళ్లి చాలా సింపుల్ గా ప్లాన్ చేస్తూ ఉండడం విశేషం. రెండే రెండు రోజుల్లో షూటింగ్ కి వెళ్ళిపోతాను అనీ పెళ్లి ని సాకుగా చూపించి షూటింగ్ లు ఎగ్గొట్టడం తన స్టైల్ కాదు అంటోంది ఆమె.


మలయాళంలో ‘సైలంట్‌ రేడియో’, ‘పెర్ఫ్యూమ్‌’, ‘యస్‌ ఐ యామ్‌’, ‘పెయింటింగ్‌ లైఫ్‌’, ‘గ్రాండ్‌ మాస్టర్‌ 2’, ‘సత్యాన్వేషణ పరీకణగళ్‌’ సినిమాల్లో ఆమె నటిస్తోంది. పెళ్లి కీ సినిమాలకీ సంబంధం లేదు అని ఇలాంటి హీరోయిన్ లు భలే నిరూపిస్తున్నారు.


సమంత కూడా నాగ చైతన్య తో కలిసి ప్లాన్ చేసుకుని పెళ్లి జరిగిన వారం కంటే ముందరే షూటింగ్ లకి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయిన సంగతి విదితమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: