తెలంగాణా సాయుధ పోరాటం లో ముఖ్యామైన మనిషిగా పోరాడి తనదైన శైలి లో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్న కెసిఆర్ తెలంగాణా వచ్చిన తరవాత తమ పార్టీ గెలుపుకి నిరంతరం కృషి చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కి కూర్చున్నారు.


తెలంగాణా ఉద్యమ నాయకుడిగా , తెరాస పెద్దగా , తెలంగాణా ముఖ్యమంత్రిగా ఆయన పేరు చాలా ఉంది. ఆయన మీద ఇప్పుడు తీయబోతున్న ఒక బయో పిక్ సంచలనం కాబోతోంది. కార్యదీక్షకు .. సమయస్ఫూర్తికి ప్రతీకగా కేసీఆర్ పేరు చెబుతారు.


అలాంటి కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కించడానికి నిర్మాత మధుర శ్రీధర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి తో కలిసి మధుర శ్రీధర్ ఈ సినిమా చేయబోతున్నారు.


స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి అవ్వడం తో నటీ నటుల ఎంపిక మీద దృష్టి పడింది నిర్మాతలకి. మొన్నటి వరకూ కెసిఆర్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు ని అనుకున్నారు కానీ రీసెంట్ గా ఫిలిం నగర్ సోర్సెస్ చెబుతున్నదాని ప్రకారం చూస్తే నవాజుద్దీన్ నే ఓకే చేసేలా ఉన్నారట. ఆయనైతేనే కేసీఆర్ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: