‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా అనౌన్స్ చేసినపుడు ఆసినిమా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈసినిమాలో నటిస్తున్న విజయ్ దేవర కొండకు మంచి క్రేజ్ ఉన్నా ఈ మూవీ పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే ఇప్పుడు ఈసినిమాను ‘బాహుబలి: ది కంక్లూజన్’ను తెలంగాణలో పంపిణీ చేసిన ఏషియన్ మూవీస్ లాంటి పెద్ద సంస్థ ‘అర్జున్ రెడ్డి’ హక్కుల్ని ఏకంగా కొనేసి ఈచిత్రాన్ని విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

అంతేకాదు ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీకి ‘బాహుబలి 2’ మాదిరిగానే దాదాపు 25 ప్రివ్యూ షోలు హైదరాబాద్ లో వేస్తున్నట్లు వార్తలు రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికితోడు ఈసినిమాకు అన్ని అర్బన్ సిటీల్లోనూ హైక్ ఏర్పడటంతో పాటు ఒక యంగ్ హీరో సినిమాకు ప్రీవ్యూలు ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ టీజర్ ట్రైలర్ కు యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ తీసుకు వచ్చింది. ఇలాంటి పరిస్థుతులలో ఈ శుక్రవారం రాబోతున్న ఈమూవీ గురించి మరొక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘అర్జున్ రెడ్డి’ సినిమాను 2 గంటల 55 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో మూడు గంటల నిడివితో సినిమాలు వచ్చి చాల రోజులైంది. దీనితో ఒక యంగ్ హీరోతో ఇలాంటి ప్రయోగం ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈమధ్య విడుదలైన కృష్ణవంశీ ‘నక్షత్రం’ కూడ ఇలాంటి భారీ నిడివి సమస్యతో ఘోరంగా ఫ్లాప్ అయింది.  అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు కంటెంట్ బలంగా ఉంది అని వార్తలు వస్తున్నా ఈ వినాయకచావితిని టార్గెట్ చేసుకుని చాలా సినిమాలు ముఖ్యంగా కోలీవుడ్ టాప్ హీరోలు అజిత్ ధనుష్ ల సినిమాలు కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఇన్ని సినిమాల పోటీ మధ్య ఈ యంగ్ హీరో నిలబడతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: