బిగ్ బాస్ షో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ప్రతివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం సహజం. ఈ వారం ముమైత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చేసింది. ముమైత్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతోందని తెలియగానే ఏదో మిస్ అవబోతోందన్న ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. అయితే అంతలోనే ఎన్టీఆర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు ఎన్టీఆర్.

Image result for mumaith in bigg boss

          బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం ముమైత్, అర్చన పోటీ పడ్డారు. అయితే ముమైత్ ఇంటినుంచి బయటకు రావాల్సి వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తో కలిసి తన అనుభవాలను పంచుకుంది. శివబాలాజీపైన బిగ్ బాంబ్ కూడా విసిరేసింది. ఎన్టీఆర్ చూపించిన తన జర్నీని కూడా చూసేసింది. చివరకు బై చెప్పి బయలుదేరింది.

Image result for mumaith in bigg boss

          ఇంకో మెట్టు ఎక్కితే ముమైత్ బయటపడుతుంది. ఇంతలో ఎన్టీఆర్ ముముత్ ను వెనక్కు పిలిపించారు. ఒక్క నిమిషం అంటూ పిలిచి.. బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రకటించాడు. దీంతో ముమైత్ ఆనందానికి అవధుల్లోకుండా పోయాయి. వాస్తవానికి ముమైత్ ను ఎలిమినేషన్ కోసం ఈవారం ఎవరూ నామినేట్ చేయలేదు. హరితేజ, ముముతై తమంతట తాము ఎలిమినేషన్ కు నామినేట్ చేసుకున్నారు. ఇదే ఇప్పుడు ముమైత్ ను సేవ్ చేసింది. స్వచ్చంధంగా నామినేట్ చేసుకున్నారు కాబట్టి ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించాడు.

Image result for mumaith in bigg boss

          అయితే ముమైత్ ను మళ్లీ నేరుగా ఇంట్లోకి పంపించలేదు. సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. ఇంటి సభ్యులపై ఓ కన్నేసి ఉంచడం, బిగ్ బాస్ తో కలిసి టాస్క్ లు ఇవ్వడం .. లాంటివి ఇప్పుడు ముమైత్ చేయాల్సిన పనులు. అయితే ఇవి తాత్కాలికమే. త్వరలోనే ముమైత్ మళ్లీ ఇంట్లో అడుగుపెట్టబోతోంది. అయితే అదెప్పుడు అంటే బిగ్ బాస్ ను అడగాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: