మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. స్పై ఏజెంట్ గా మహేష్ నటించబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించగా ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు ఈ సినిమాను 130 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.


ఇక మహేష్ తో సినిమా పదేళ్ల క్రితమే చేయాల్సిందని.. తెలుగు తమిళ భాషలు వచ్చిన హీరో కాబట్టి మహేష్ తో తాను ఎప్పుడో వర్క్ చేద్దామని అనుకున్నా అని అన్నారు మురుగదాస్. అసలైతే తుపాకి సినిమా తెలుగు రీమేక్ లో మహేష్ చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని విజయ్ సినిమానే ఇక్కడకు డబ్ చేసి రిలీజ్ చేశారు.


మహేష్ తో సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ గా ఉంటుందని చెప్పిన మురుగదాస్ కచ్చితంగా ఫ్యాన్స్ కు స్పైడర్ మంచి ట్రీట్ ఇస్తుందని అన్నారు. ఇక ఈ సినిమాతో తమిళంలోకి మహేష్ ఇంట్రడ్యూస్ అవడం విశేషం. తమిళ మార్కెట్ మీద సత్తా చాటేందుకు మహేష్ స్పైడర్ గా వస్తున్నాడు.


మహేష్ ఎన్నాళ్ల నుండో మురుగదాస్ తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నా తన వల్లే ఇన్నేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చిందని అంటున్నాడు మురుగదాస్. స్పైడర్ తో మంచి అనుభవం ఏర్పడిందని చెప్పిన మురుగదాస్ మరి సినిమాను ఎలా తెరకెక్కించాడో చూడాలి. దసరా బరిలో ప్రెస్టిజియస్ మూవీగా రాబోతున్న స్పైడర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: