యంగ్ టైగర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. వారం మొత్తం ఎలా ఉన్నా సరే వారాంతరంలో ఎన్.టి.ఆర్ వచ్చి హుశారెత్తించడం కామనే. ప్రతివారం ఎన్.టి.ఆర్ ఈసారి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడు అన్న దాని మీద ఆడియెన్స్ ఎక్సయిట్మెంట్ ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఎన్.టి.ఆర్ ఎంట్రీ అదుర్స్ అని చెప్పాలి.


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి.. విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం. సిరివెన్నెల రాసిన ఈ పాటను పాడుతూ ఆ పాట జీవితానికి ఓ బాట అంటూ ఎన్.టి.ఆర్ తన యాంకరింగ్ స్టార్ట్ చేశాడు. ఇక కొత్త కెప్టెన్ నవదీప్ ను ఆటాడుకున్న విధానంతో పాటుగా ఎలిమినేషన్ సర్కిల్ లో ఉన్న ముమైత్, అర్చనలలో ముమైత్ ను ఎలిమినేట్ చేశాడు.


ఇక ముమైత్ ఎన్.టి.ఆర్ దగ్గరకు రావడం ఆమెను ఎలిమినేట్ చేసినట్టే చేసి ఈ ఎలిమినేషన్ ఎందుకో ఫెయిర్ కాదని ఆమెను సీక్రెట్ రూం లోకి పంపించడం జరిగింది. హౌజ్ మెట్స్ కు ముమైత్ ఎలిమినేట్ అయ్యిందనే తెలుసు కాని ముమైత్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 1 లో సీక్రెట్ రూం లో బందీగా ఉండబోతుంది. బిగ్ బాస్ సీజన్ 1 లోనే ఈ సీక్రెట్ రూం హంగామా మొదలు పెట్టాడు ఎన్.టి.ఆర్.


మొత్తానికి అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ అదరగొట్టేశాడు. ఇక బోన్ లో హౌజ్ మెట్స్ గురించి అభియోగాలు చేస్తూ వారి నుండి వివరణ అడిగిన తీరు ఆకట్టుకుంది. మొత్తానికి ఈ శని ఆదివారాలు కూడా తారక్ స్టీల్ ద షో.. కుర్చీలాటతో పాటుగా ఎన్.టి.ఆర్ వారితో సాగించిన సరదా సంభాషణలు ఆడియెన్స్ ను అలరించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: