ఈమధ్య కాలంలో సెలెబ్రెటీలు తమ అభిమానుల పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ తన అభిమాని పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచిన సంఘటన ఇంకా మర్చి పోకుండానే హాట్ యాంకర్ అనసూయ తన అభిమానికి ఇచ్చిన క్లాష్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

అనసూయ తన బుల్లితెర షోలలో ఎక్కువగా స్కిన్ షో చేస్తోందని చిట్టిపొట్టి బట్టలతో ఆమె బుల్లితెర పై చేస్తున్న హంగామా చాల మితిమీరిపోతోంది అంటూ ఇప్పటికే అనేకసార్లు విమర్శలు వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ ను అనసూయ పట్టించు కోకుండా తన రేంజ్ లో రెచ్చి పోతూనే ఉంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఇన్‌స్టాగ్రాం ఎకౌంట్ లో ఒక నెటిజన్ చేసిన కామెంట్ అనసూయకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘‘నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా, ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు, మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా’’ అంటూ ఆ అభిమాని తన బాధను వ్యక్త పరిచాడు. అయితే ఆ కామెంట్ పై అనసూయ తీవ్రంగా స్పందించింది. 

తన ప్రోగ్రాం చూడటం నచ్చనప్పుడు చానల్ మార్చుకునే ఆప్షన్ ఉంది కదా అని అంటూ కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి అనవసరంగా ఇటువంటి కార్యక్రమాలు చూడటం బదులు ఏదైనా విజ్ఞానాన్ని పెంపొందించుకునే కార్యక్రమం చూస్తూ ఉంటే తాను అడ్డు పడ్డానా అంటూ రివర్స్ క్లాస్ పీకింది అనసూయ అంతేకాదు ఎదుటి వారిని కించపరిచే విధంగా కామెంట్స్ చేయడం మానుకోమని సలహాలు ఇస్తూ తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో సలహాలు తీసుకోవలసిన పరిస్థితిలో తాను లేను అంటూ మాటల దాడి చేసింది అనసూయ..   


మరింత సమాచారం తెలుసుకోండి: