గత ఆరునెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కాదు కదా కనీసం టైటిల్ ను కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో పవర్ స్టార్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఈసినిమా ఫస్ట్ లుక్ గురించి ఎదురు చూస్తున్నారు.  మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజున ఖచ్చితంగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల  అవుతుంది అన్న ఆశతో పవన్ అభిమానులు పవన్ పుట్టిన రోజు గురించి ఎదురు  చూస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో  లేటెస్ట్ గా  పవన్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. అంతేకాదు  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గా విడుదల చేయబోతున్న ఫోటో ఇదే అంటూ హడావిడి జరుగుతోంది.  ఈ పోస్టర్ లో పవన్ లుక్ అదిరిపోయే రేంజ్ లో ఉంది అంటూ పవన్ ఫాన్స్ అప్పుడే కామెంట్స్ పెడుతూ లైక్ లు కూడ కొడుతున్నారు. అయితే గొడుగు పట్టుకుని సింపుల్ గా కూర్చుని ఉన్న పవన్ గడ్డం లుక్ త్రివిక్రమ్ సినిమాలోనిదా ? కాదా  అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా ఈ ఫోటో పై ప్రస్తుతం హడావిడి మాత్రం చాలా తీవ్రస్థాయిలో జరుగుతోంది. 
 
ప్రస్తుతం పవన్ ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న   నేపధ్యంలో తన పుట్టినరోజు తరువాత పవన్ కు పాలిటిక్స్ పై అంతగా ఫోకస్ పెట్టే సమయం   దొరక్కపోవచ్చు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికికారణం  త్రివిక్రమ్ పవన్ పుట్టిన రోజు తరువాత ఈ మూవీకి సంబంధించి భారీ షెడ్యూల్ యూరోప్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి కథ ప్రకారం ఇది చాలా కీలకమైన షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేయాలని  త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. వాస్తవానికి ఈ ఫారిన్ షెడ్యూల్ ను చాలా రోజుల కిందటే ప్లాన్ చేసినా పవన్ కు ఉన్న మిగతా కమిట్ మెంట్స్ కారణంగా అది వాయిదాపడుతూ వచ్చింది అని టాక్. 

ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవడంతో ఈసారి వీలైనంత త్వరగా ఫారిన్ షెడ్యూల్ ను కంప్లీట్ చేయాలని  త్రివిక్రమ్ హడావి డి పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తీస్తూ ఈసినిమా టైటిల్ గురించి లోతైన ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: